AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ లడ్డూలు తినండి చాలు..

Weight Loss Laddoo Recipe: ఆధునిక ప్రపంచంలో చాలామంది ఊబకాయం, స్థూలకాయం బారిన పడుతున్నారు. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడంతో

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ లడ్డూలు తినండి చాలు..
Seeds Laddoo Recipe
Shaik Madar Saheb
|

Updated on: Aug 08, 2021 | 12:22 PM

Share

Weight Loss Laddoo Recipe: ఆధునిక ప్రపంచంలో చాలామంది ఊబకాయం, స్థూలకాయం బారిన పడుతున్నారు. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడంతో బరువు త్వరగా పెరుగిపోయి.. పలు వ్యాధుల బారిన పడుతున్నారు. అనంతరం బరువు తగ్గించుకునేందుకు పలు డైటింగ్‌లు చేయడంతోపాటు ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో బరువు తగ్గాలనుకునే వారు నిత్యం వ్యాయామం చేయడంతోపాటు.. ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలతో సహా ఇతర పోషకాలు అధికంగా ఉండే వాటిని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. బరువు వేగంగా తగ్గడానికి పలు రకాల గింజలను కూడా ఆహారంలో చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి గింజల్లో చియా, గుమ్మడికాయ, పుచ్చకాయ, అవిసె గింజలు ప్రధానమైనవి. ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనివల్ల బరువు నియంత్రణలో ఉండటంతోపాటు.. చెడు కొలెస్ట్రాల్ సులభంగా తగ్గుతుంది.

అయితే.. బరువు తగ్గాలనుకునే వారు ఈ గింజలతోపాటు కొంచెం బెల్లం కలుపుకొని లడ్డూల్లాగా తయారు చేసుకొని తినాలి. ఈ లడ్డూ తినడం వల్ల ఆకలి అనిపించదు. వీటిల్లో కేలరీల పరిమాణం చాలా తక్కువగా.. ఉండటంతోపాటు.. ప్రయోజనాలు అధికంగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే.. ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు.. చియా గింజలు – కప్పు గుమ్మడికాయ గింజలు – కప్పు పుచ్చకాయ గింజలు – కప్పు అవిసె గింజలు – కప్పు దేశీ నెయ్యి – 1/2 కప్పు ఓట్స్ – 2 కప్పులు ఎండిన పండ్లు కప్పు బెల్లం

మీకు కావాలంటే.. ఎక్కువ పరిమాణంలో కూడా తయారు చేసుకోవచ్చు.

ఎలా తయారు చేయాలంటే..? ముందుగా పాన్ తీసుకొని అందులో అన్ని రకాల విత్తనాలను వేడి చేసి చల్లార్చాలి. గింజలు చల్లబడే వరకు నెయ్యిని వేడి చేసి వాటిలో ఓట్స్ వేసి వేయించాలి.

ఓట్స్ బాగా వేయించిన అనంతరం దానిలో జీడిపప్పు, ఎండుద్రాక్ష, బెల్లం పొడి జోడించాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని కదిలిస్తూ.. బెల్లం పాకం బాగా కలిసే వరకు చూడాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని చల్లార్చాలి.

ఈ క్రమంలో చల్లార్చిన విత్తనాలన్నింటి బాగా మెత్తగా చేసి మిశ్రమంలో కలపాలి. అనంతరం కొద్దిగా చేతులకు నెయ్యి పూసుకుని లడ్డూలను తయారు చేయండి.

ఆ తర్వాత ఉదయం రెండు, సాయంత్ర రెండు చొప్పున లడ్డూలను తింటే సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిల్లో ప్రొటిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయని సూచిస్తున్నారు.

Also Read:

Platelet Count: ప్లేట్‌లెట్స్‌ ఎందుకు తగ్గుతాయి.. ఒక వేళ తగ్గితే ప్రమాదం ఏమిటి.. వాటిని పెంచుకోవడం ఎలా.?

Pumpkin Seeds: గుమ్మడి గింజల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!