Pumpkin Seeds: గుమ్మడి గింజల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

గుమ్మడి గింజల్లో కొవ్వు ఆమ్లాలు, భాస్వరం, పొటాషియం, జింక్ లాంటి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫినోలిక్ ఉంటాయి. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

Pumpkin Seeds: గుమ్మడి గింజల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
Pumpkin Seeds
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 09, 2021 | 6:34 PM

గుమ్మడికాయ గింజలు చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నాయని అంటారు. ఇందులో కొవ్వు ఆమ్లాలు, భాస్వరం, పొటాషియం, జింక్ లాంటి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫినోలిక్ సమ్మేళనాలు కలిగి ఉంటాయి. ఈ గింజలను తీసుకోవడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, కండరాలు/ఎముకల నొప్పి, జుట్టు రాలడం, మొటిమలను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి.

క్యాన్సర్ నిరోధకంగా: గుమ్మడికాయ గింజలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఆర్థరైటిక్‌తోపాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్, మూత్రాశయ ఇన్ ఫెక్షన్‌లు రాకుండా కాపాడతాయి.

చర్మ సంరక్షణకు: గుమ్మడికాయ గింజలు, వాటి నూనె చర్మ సంరక్షణకు ఏజెంట్లుగా పనిచేస్తాయి. వీటిలో విటమిన్ ఏ, సీ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. కొల్లాజెన్ గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా, ముడతలు లేకుండా ఉంచేందుకు సహాయపడుతుంది. గుమ్మడి గింజల నూనెలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, కెరోటిన్ ఉంటాయి. ఇవి మొటిమలు, బొబ్బలు, చర్మ సంబంధమైన దీర్ఘకాలిక మంటలను నయం చేస్తాయి. ఇది స్క్రబ్, లోషన్ రూపంలో లేదా మసాజ్ చేసినప్పుడు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షిస్తుంది.

గుండె జబ్బుల నివారణకు: గుమ్మడికాయ గింజలను ఆహారంలో చేర్చడం వల్ల కొలెస్ట్రాల్ నిక్షేపాలు, రక్త నాళాలు గట్టిపడకుండా నిరోధించవచ్చు. ఇది కొరోనరీ ఆర్టరీ వ్యాధి, స్ట్రోక్ వంటి వివిధ గుండె సమస్యలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

జుట్టు పెరుగుదలకు: ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఈ విత్తనాలలో మంచి మోతాదులో ఉంటాయి. గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది బట్టతల సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే జుట్టు రాలడం లాంటి సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది.

మధుమేహా నియంత్రణలో..: గుమ్మడికాయ గింజలు యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. మధుమేహాన్ని నియంత్రించడానికి విత్తనాలు, గుమ్మడికాయ ఆకులు, గుజ్జును ఆహారంలో చేర్చుకోవచ్చు.

కొలెస్ట్రాల్, ఊబకాయం తగ్గేందుకు: గుమ్మడికాయ గింజలు ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లకు నిలయం. గుమ్మడికాయ గింజలు బరువును నియంత్రించగలవు. కాలేయంలో కొలెస్ట్రాల్ నిక్షేపాలను నిరోధించగలవు. ఈ విత్తనాలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫైటోస్టెరాల్స్, విటమిన్ ఈ ఉత్పన్నాలు, కెరోటిన్ ఉంటాయి. ఇవి ఊబకాయం పెరగకుండా నిరోధించడంలో ఎంతో సహాయపడతాయి.

Also Read: Eye Care: కంప్యూటర్ అధిక వాడకంతో పిల్లల కళ్ళు పోడిబారిపోతాయి..దీనిని 20:20 ఫార్ములాతో నివారించండి..ఎలాగంటే..

Breastfeeding: తల్లిపాలకు, ఇతర పాలకు తేడా ఏమిటి..?.. పరిశోధనలలో తేలిన విషయాలు..!

అమ్మాయి టిక్‌ టాక్‌ వీడియో చేస్తోంది..! అప్పుడే వాళ్ల అమ్మ వచ్చింది..? ఏం జరిగిందంటే..

భారత్ వెయిట్ లిఫ్టర్లకు షాక్.. ఒలింపిక్స్‌ కమిటీ సంచలన నిర్ణయం..