Egg Yolk: గుడ్లు తినేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా..?

గుడ్లు తినేటప్పుడు మీరు పచ్చసొనను తీసేసి తింటున్నారా.. అయితే మీరు ఎలాంటి తప్పు చేస్తున్నారో కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. గుడ్డులోని ఈ పసుపు భాగం మీ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

Egg Yolk: గుడ్లు తినేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా..?
Eggs
Follow us

|

Updated on: Aug 08, 2021 | 4:26 AM

గుడ్లు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయని, ప్రోటీన్‌కి కేరాఫ్ అడ్రస్‌గా పరిగణించబడుతుందని అందరికీ తెలుసు. అయితే ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ చూపేవారు గుడ్డు లోపల పసుపు భాగాన్ని తీసేసి తెల్లటి భాగాన్ని మాత్రమే తింటుంటారు. మరి ఇలా చేయడం సరైనదేనా? అంటే కచ్చితంగా కాదనే అంటున్నారు నిపుణులు. గుడ్డు పచ్చసొన శరీరానికి ప్రయోజనకరంగా ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. వాస్తవానికి, పచ్చసొనలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉందని, దానిని తొలగించి గుడ్లు తింటుంటారు చాలామంది. ఇది శరీరానికి హానికరమని వారు భావిస్తుంటారు. అయితే గుడ్డులోని పచ్చసొనలో 186 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ మాత్రమే ఉంటుంది. గుడ్లలోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉన్నది నిజమే, కానీ, అది అనుకున్నంతగా శరీరానికి హానికరం కాదు. మన శరీరానికి కూడా కొలెస్ట్రాల్ అవసరం ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్‌ను తయారు చేస్తుంది. శక్తి స్థాయిలను పెంచడంతోపాటు కండరాలను పుష్టిగా చేస్తుంది.

పచ్చసొన అనేక పోషకాలకు మూలం గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఏ, డీ, ఈ, బీ -12, కే, ఐరన్, రిబోఫ్లేవిన్ వంటివి చాలా ఉన్నాయి. ఇవి మన శరీరానికి కూడా చాలా అవసరం. ఇవి శరీర సమతుల్యతను అభివృద్ధి చేయడంలో చాలా కీలకమైనవి. కేవలం గుడ్డులోని తెల్లటి భాగాన్ని మాత్రమే తింటుంటే, ఈ పోషకాలన్నింటికి మీరు దూరంగా ఉన్నట్లే. అందుకే గుడ్డులోని పసుపు భాగాన్ని కూడా తినాలని అంటున్నారు నిపుణులు. తెల్లసొన కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించబడిన హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నివేదిక ప్రకారం, ప్రతీ వారం ఏడు గుడ్లు తినే వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా తక్కువ. అయితే, ఒక రోజులో పచ్చసొనతో 7-8 గుడ్లు తింటే మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని పేర్కొంది.

పచ్చసొన తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. అనేక నివేదికల ప్రకారం, గుడ్డులోని సొనలు కోలిన్‌కు ముఖ్యమైన మూలంగా ఉంటాయి. ఇది మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే గర్భధారణ, పిల్లలకుపాలిచ్చే సమయంలో కోలిన్ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెదడుకు చాలా మంచిది. అలాగే యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి శరీరానికి ఎంతో శక్తిని అందించడంతో సహాయపడుతుంది. కళ్లను కాపాడడంలోనూ ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది.

Also Read: Eye Care: కంప్యూటర్ అధిక వాడకంతో పిల్లల కళ్ళు పోడిబారిపోతాయి..దీనిని 20:20 ఫార్ములాతో నివారించండి..ఎలాగంటే..

Breastfeeding: తల్లిపాలకు, ఇతర పాలకు తేడా ఏమిటి..?.. పరిశోధనలలో తేలిన విషయాలు..!

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..