Rahul Gandhi: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని కాదు.. రాష్ట్రపతి ప్రారంభించాలి: రాహుల్ గాంధీ
త్రిభుజాకార ఆకారంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనాన్ని ప్రధాని మోడీ మే28న ప్రారంభించనున్నారు. 64,500 చదరపు మీటర్ల బిల్ట్-అప్ ఏరియాతో కొత్త పార్లమెంట్ భవనాన్ని అత్యంత అద్భుతంగా నిర్మించారు. అయితే, అదేరోజు (మే 28) హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ జయంతి వేడుకలు జరగనున్నాయి.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని ట్వీట్ చేశారు రాహుల్. ప్రధాని కేవలం ప్రభుత్వానికి మాత్రమే నేతృతం వహిస్తారని, రాష్ట్రపతి మాత్రం మొత్తం శాసన వ్యవస్థకు నేతృత్వం వహిస్తారని అంటున్నాయి విపక్షాలు. అందుకే రాష్ట్రపతి చేతుల మీదుగా కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఈనెల 28వ తేదీన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాహుల్ తెరపైకి తీసుకొచ్చిన డిమాండ్ చర్చనీయాంశంగా మారింది.
త్రిభుజాకార ఆకారంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనాన్ని ప్రధాని మోడీ మే28న ప్రారంభించనున్నారు. 64,500 చదరపు మీటర్ల బిల్ట్-అప్ ఏరియాతో కొత్త పార్లమెంట్ భవనాన్ని అత్యంత అద్భుతంగా నిర్మించారు. అయితే, అదేరోజు (మే 28) హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ జయంతి వేడుకలు జరగనున్నాయి. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సావర్కర్ జయంతి రోజున జరగనుండటం కూడా రాజకీయ రగడకు దారితీసింది. స్పీకర్ ఓం బిర్లా ఈ వారం ప్రధాని మోదీని కలిశారని, కొత్త భవనాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానించారని లోక్‌సభ సచివాలయం మీడియాకు తెలిపింది.
ఆ తేదీనే ఎందుకు ప్రారంభించాలని.. “26 నవంబర్ 2023- దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బహుమతిగా ఇచ్చిన భారత రాజ్యాంగం 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని.. కొత్త భవనం ప్రారంభోత్సవానికి ఇది తగినది.. అయితే ఇది సావర్కర్ పుట్టినరోజు మే 28న జరుగుతుంది- ఇది ఎంతవరకు సముచితం?” అంటూ తృణమూల్ ఎంపీ సుఖేందు శేఖర్ రే పేర్కొన్నారు.
అయితే, కొత్త పార్లమెంట్ భవనాన్ని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఎందుకు ప్రారంభించరని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. “ప్రధానమంత్రి పార్లమెంటును ఎందుకు ప్రారంభించాలి? ఆయన కార్యనిర్వాహక అధిపతి, శాసనసభ కాదు. అధికారాల విభజన ఉంది.. గౌరవనీయులైన లోక్‌సభస్పీకర్, రాజ్యసభ చైర్మన్ ప్రారంభించవచ్చు. ఇది ప్రజల సొమ్ముతో నిర్మించారు” అంటూ ఒవైసీ ట్వీట్ చేశారు.
ఇది పెద్దవారిని అగౌరపరచడేమేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొనగా.. ప్రధానమంత్రి ప్రభుత్వాధినేత అయితే, రాష్ట్రపతి భారత దేశానికి అధిపతి అని, ఆమెను ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం అవమానమని, ఆమె పదవిని కించపరచడమేనని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా పేర్కొన్నారు.
కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన డిసెంబర్ 10, 2020న జరిగింది. ఉభయ సభల ఉమ్మడి సమావేశాల సందర్భంలో కొత్త భవనంలో మొత్తం 1,280 మంది సభ్యులు కూర్చునేలా అత్యాధునిక సౌకర్యాలతో దీనిని నిర్మించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..