Rahul Gandhi t-shirt: ‘అందుకే టీ షర్ట్ ధరిస్తున్నాను.. ఆ రోజున తెలుస్తుంది నాకు కూడా చలిపుడుతుందని’

కేవలం టీషర్ట్‌ మత్రమే ధరించి రోడ్లపై యాత్ర చేస్తున్న రాహుల్‌ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో ఆయన కేవలం టీషర్ట్‌ మాత్రమే ధరించడం వెనుక అసలు కారణం చెప్పారు..

Rahul Gandhi t-shirt: 'అందుకే టీ షర్ట్ ధరిస్తున్నాను.. ఆ రోజున తెలుస్తుంది నాకు కూడా చలిపుడుతుందని'
Rahul Gandhi
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 10, 2023 | 11:33 AM

భారత్‌ జోడో యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి రాహుల్ గాంధీ ధరించిన టీషర్టుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఉత్తర భారతంలో చలి తీవ్రత తట్టుకోలేక నానా అగచాట్లు పడుతుంటే.. కేవలం టీషర్ట్‌ మత్రమే ధరించి రోడ్లపై యాత్ర చేస్తున్న రాహుల్‌ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో ఆయన కేవలం టీషర్ట్‌ మాత్రమే ధరించడం వెనుక అసలు కారణం చెప్పారు. హర్యానాలో జరిగిన మీడియా సమావేశంలో టీషర్టుపై గత కొంతకాలంగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.

మీకు ఎందుకు చలి అనిపించడంలేదని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..’ కేరళలో చాలా వేడిగా అనిపించింది. మద్యప్రదేశ్‌కి రాగానే కాస్త చలిగా అనిపించింది. యాత్ర సమయంలో చినిగిని దుస్తులతో చలిలో వణుకుతున్న ముగ్గురు పేద పిల్లలు నా దగ్గరికి వచ్చారు. నేను కూడా చలికి వణికేంతవరకూ కేవలం టీషర్ట్‌ మాత్రమే ధరించాలని ఆ రోజే నిర్ణయించుకున్నానని రాహుల్‌ గాంధీ సమాధానం చెప్పారు. రాహుల్‌ టీషర్ట్‌ ధరించడం వెనుక జిమ్మిక్‌ ఉందని భారత జనతా పార్టీ చేస్తున్న విమర్శలపై ఆయన ధ్వజమెత్తారు. యాత్రలో నా రూపం, నేను ధరించిన దుస్తులపై మీడియా దృష్టిపెట్టింది. కానీ, నాతో పాటు ఈ యాత్రలో చాలా మంది పేదవాళ్లు చిరిగిన దుస్తులతోనడుస్తున్నారు. వాళ్లను ఎందుకు గుర్తించట్లేదని ప్రశ్నించారు. నిజానికి నేను టీషర్టుతో నడవం ఇక్కడ సమస్య కాదు. నాతో ఉన్న పేదవాళ్లు చిరిగిన దుస్తులు ఎందుకు వేసుకోవాల్సి వస్తుందనేదే అసలైన ప్రశ్న అని రాహుల్‌ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.