AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: చెరువులోకి దిగి చేపలు పట్టిన రాహుల్ గాంధీ.. వీడియో చూశారా..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపలు పట్టారు. అవును.. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్‌కి వెళ్లిన రాహుల్.. ఏకంగా మత్స్యకారులతో కలిసి చెరువులోకి దూకి చేపలు పటడంతో అంతా అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాకుండా మత్స్యకారుల సంక్షేమానికి ఆయన పలు హామీలు కూడా ఇచ్చారు.

Rahul Gandhi: చెరువులోకి దిగి చేపలు పట్టిన రాహుల్ గాంధీ.. వీడియో చూశారా..
Rahul Gandhi Jumps Into A Pond To Catch Fish
Krishna S
|

Updated on: Nov 02, 2025 | 5:21 PM

Share

బీహార్ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మొదటి దశ పోలింగ్‌కు గడువు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ప్రచారంలో దూకుడు పెంచారు. ఆదివారం బెగుసరాయ్ జిల్లాలో ఆయన ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మత్స్యకారులను కలిశారు. మత్సకారులతో పాటు చెరువులోకి దూకడంతో అంతా ఆశ్చర్యపోయారు.

చెరువులోకి దిగిన రాహుల్

బెగుసరాయ్‌లోని మత్స్యకారులు నిర్వహించిన సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అక్కడ ఆయన కేవలం ప్రసంగించడం కాకుండా మత్స్యకారులతో కలిసి చేపలు పట్టారు. ఈయనతో పాటు వీఐపీ చీఫ్ ముఖేష్ సాహ్ని, కాంగ్రెస్ నాయకులు కన్హయ్య కుమార్ కూడా చెరువులోకి దిగారు. ముగ్గురు నాయకులు గ్రామస్తులతో మాట్లాడి.. వాళ్ల కష్టాలు తెలుసుకున్నారు.

ప్రజల ఆనందం..

రాహుల్ గాంధీ స్వయంగా చెరువులోకి దిగి. వల వేసి చేపలు పట్టడం చూసిన అక్కడి ప్రజలంతా అవాక్కయ్యారు. తాము ఇంతకు ముందెన్నడూ ఇలాంటి నాయకుడిని చూడలేదని అన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత ఇలా చేయడం తమకు గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి మద్ధతుగా నినాదాలు చేశారు. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్‌ చేయగా.. అది వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా మహా కూటమి మత్స్యకారులకు ఇచ్చిన హామీలను కూడా పార్టీ వెల్లడించింది.

ఆర్థిక సహాయం: కరువు కాలంలో మత్స్యకార కుటుంబాలకు కుటుంబానికి రూ.5,000 సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది.

ప్రోత్సాహకాలు: మత్స్య బీమా పథకం, ప్రతి ఊరి దగ్గర చేపల మార్కెట్లు, ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు.

ప్రాధాన్యం: సాంప్రదాయ మత్స్యకారులకు చెరువులు కేటాయించడంలో మొదట అవకాశం ఇస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..