Lok Sabha: ఖరీదైన పెళ్లిళ్లకు చెక్.. 100మంది అతిథులు, 10 రకాల వంటలకే పరిమితి.. లోక్‌సభలో కొత్త బిల్లు ప్రవేశ పెట్టిన ఎంపీ..

Punjab MP Jasbir Singh Gill: పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్‌కు చెందిన ఎంపీ గిల్ మాట్లాడుతూ, వధువు కుటుంబంపై చాలా ఆర్థిక భారం పడే దుబారా ఖర్చులను ఈ బిల్లు అంతం చేయాలని కోరుతోంది. విలాసవంతమైన పెళ్లి కోసం ప్రజలు ఆస్తులు, ప్లాట్లు అమ్మి అప్పులు చేయాల్సి వచ్చిందని గిల్ వివరించారు. ఆడపిల్లను ఇకపై భారంగా చూడలేనందున ఇది "భ్రూణహత్యలను అరికట్టడంలో చాలా వరకు దోహదపడుతుంది" అని ఆయన అన్నారు.

Lok Sabha: ఖరీదైన పెళ్లిళ్లకు చెక్.. 100మంది అతిథులు, 10 రకాల వంటలకే పరిమితి.. లోక్‌సభలో కొత్త బిల్లు ప్రవేశ పెట్టిన ఎంపీ..
Punjab Mp Jasbir Singh Gill
Follow us
Venkata Chari

|

Updated on: Aug 06, 2023 | 6:20 AM

Occasions Bill 2020: శుక్రవారం లోక్‌సభలో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. ఇది వివాహ సమయంలో ఖర్చుపై పరిమితిని విధించాలని కోరుతున్నారు. ఈ బిల్లులో అతిథుల సంఖ్య, వృధా ఖర్చులు నివారించేందుకు నూతన వధూవరులకు బహుమతుల కోసం వెచ్చించే మొత్తంతో పాటు ఆహారంపై ఖర్చు చేసే మొత్తాన్ని పరిమితం చేయాలంటూ కోరారు. ‘ప్రత్యేక సందర్భాలలో వృధా ఖర్చుల నిరోధక బిల్లు, 2020’ అనే ప్రైవేట్ మెంబర్ బిల్లును మొదటిసారిగా జనవరి 2020లో కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ ప్రవేశపెట్టారు.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, ఖరీదైన బహుమతులకు బదులుగా, నిరుపేదలు, అనాథలు లేదా ప్రభుత్వేతర సంస్థలకు (NGOలకు) విరాళాలు అందించాలని గిల్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్‌కు చెందిన ఎంపీ గిల్ మాట్లాడుతూ, వధువు కుటుంబంపై చాలా ఆర్థిక భారం పడే దుబారా ఖర్చులను ఈ బిల్లు అంతం చేయాలని కోరుతోంది. విలాసవంతమైన పెళ్లి కోసం ప్రజలు ఆస్తులు, ప్లాట్లు అమ్మి అప్పులు చేయాల్సి వచ్చిందని గిల్ వివరించారు. ఆడపిల్లను ఇకపై భారంగా చూడలేనందున ఇది “భ్రూణహత్యలను అరికట్టడంలో చాలా వరకు దోహదపడుతుంది” అని ఆయన అన్నారు.

ఆయన బిల్లును ప్రవేశపెట్టడానికి దారితీసిన తన స్వంత అనుభవాన్ని కూడా పంచుకున్నాడు. 2019లో ఫగ్వారాలో జరిగిన ఒక వివాహానికి హాజరయ్యారు. అక్కడ అతను 285 ట్రేలను చూశాడు. వాటిలో కనీసం 129 ట్రేలలోని ఆహారాన్ని ఎవరూ ముట్టుకోలేదని చెప్పుకొచ్చాడు. “అదంతా వృధాగా పోయింది” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

బిల్లు ప్రకారం, కుటుంబంలోని రెండు వైపుల నుంచి 100 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించాలి. వంటకాలు 10 మందికి మించకూడదు. నూతన వధూవరులకు బహుమతులు రూ. 2,500 లకు మించకూడదు. ఖరీదైన బహుమతులకు బదులుగా, సమాజంలోని బలహీన వర్గాలకు లేదా స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వాలి అంటూ సూచించారు. తన కుటుంబంలో అదే అమలు చేశానని, తన కొడుకు, కుమార్తె వివాహం జరిగినప్పుడు, 30-40 మంది అతిథులకు మించి లేరని ఎంపీ తెలిపారు.

ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. భారతీయ వివాహాలను అంగరంగ వైభవంగా నిర్వహించకూడదంటూ బిల్లు తీసుకురావడం ఇదే తొలిసారి కాదు. డిసెంబర్ 2017లో ముంబై నార్త్‌లోని లోక్‌సభ ఎంపీ, బీజేపీకి చెందిన గోపాల్ చినయ్య శెట్టి దేశంలోని వివిధ ప్రాంతాలలో వివాహాలు, వేడుకల దుబారాను నిరోధించడానికి, నిషేధించడానికి ఒక బిల్లును ప్రవేశపెట్టారు.

అదేవిధంగా, ఫిబ్రవరి 2017లో, కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్, వివాహాల్లో వడ్డించే జాబితా, వంటకాలను పరిమితం చేసేందుకు ‘ది మ్యారేజెస్ ( రిజిస్ట్రేషన్ మరియు తప్పనిసరి వృధా ఖర్చుల నివారణ) బిల్లు, 2016’ని తీసుకువచ్చారు. పెళ్లికి రూ.5 లక్షలకుపైగా ఖర్చు చేసేవారు పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిల పెళ్లిళ్లకు 10 శాతం మొత్తాన్ని జమ చేయాలని బిల్లులో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..