AIADMK: వన్యప్రాణుల అవయవాలతో తాంత్రిక పూజలు.. అడ్డంగా బుక్కయిన అన్నాడీఎంకే నేత..
Tamil Nadu: తమిళనాడు అన్నాడీఎంకే నేత కారులో జంతువుల అవయవాలు సంచలనం సృష్టించాయి. వన్యప్రాణుల అవయవాలతో తాంత్రిక పూజలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తమపాళ్యంలో పోలీసుల తనిఖీలు చేస్తుండగా.. అన్నాడీఎంకేకు చెందిన నేత కారులో అవయవాలు బయటపడ్డాయి. వన్యప్రాణుల అవయవాలతో పూజలు చేస్తే.. ఐశ్వర్యం వస్తుందని తాంత్రికుడు చెప్పడంతో ఆ దిశగా అడుగులు వేసి.. ఇప్పుడు పోలీసుల చేతిలో అడ్డంగా బుక్కయ్యారు అన్నాడీఎంకే నేత.

కేరళ నుంచి తేని జిల్లాకు వస్తుండగా కారులో అవయవాలు బయటపడ్డాయి. జోసెఫ్ అనే తాంత్రిక పూజారి కోసం అవయవాలు తీసుకువెళ్తున్నామని కారు డ్రైవర్ చెప్పారు. ఇక.. అవయవాలను స్వాధీనం చేసుకుని ల్యాబ్‌కు తరలించారు పోలీసులు. మానవ అవయవాలా.. లేక జంతువులకు సంబంధించనవా అనేది తేల్చనున్నారు అధికారులు.
దీనికి సంబంధించి.. జేమ్స్ అనే తాంత్రికుడితోపాటు మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. తాంత్రిక పూజల వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అవయవాలతో పట్టుబడ్డ అన్నాడీఎంకే నేత తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇంట్లో మానవ అవయవాలను ఉపయోగించి పూజలు నిర్వహిస్తే సంపద, శ్రేయస్సు వస్తుందని జేమ్స్ నమ్మించాడని పోలీసులు తెలిపారు. తాంత్రిక పూజలు నిర్వహించేందుకు జేమ్స్ రూ.2.5 లక్షలు వసూలు చేశాడంట . జేమ్స్ నివాసంలో పూజలు చేసినట్లు వారు తెలిపారు.
“అవయవాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపాం. మేక అవయవాలను మటన్ దుకాణం నుంచి కొనుగోలు చేసినట్లు నిందితులు తెలిపారు. రిపోర్టులు వచ్చిన తర్వాతే వీటిపై మేం మాట్లాడగలం” అని తేని పోలీస్ సూపరింటెండెంట్ దొంగరే ప్రవీణ్ ఉమేష్ తెలిపారు. కాగా, అక్టోబర్ 2022లో కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని ఎలంతూర్ నుంచి రెండు నరబలి కేసులు నమోదయ్యాయి. ఆధునిక కాలంలోనూ కొందరు తాంత్రిక పూజలు నమ్మడం, వీటికోసం నరబలితోపాటు, జంతువులను కూడా హింసించడం లాంటి వార్తలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఇవి తప్పని దేశ వ్యాప్తంగా ఎందరో చెబుతున్నా.. కొందరు మాత్రం వీటిని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకపోతున్నారు. తాజాగా ఇలాంటిదే తమిళనాడులో చోటు చేసుకోవడంతో మరోసారి అంతా షాక్ అవుతున్నారు.
ఆధునిక టెక్నాలజీ కాలంలోనూ తాంత్రిక పూజలను నమ్మడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విషయాల పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వాటిని నమ్మవద్దని, ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవలని అంతా కోరుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..