AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంజాబ్‌లో బయటపడ్డ మరో ఉగ్ర కుట్ర. 10 మంది ఉగ్రవాదుల అరెస్ట్!

పంజాబ్ పోలీసులు భారీ విజయాన్ని సాధించారు. లూథియానా కమిషనరేట్ పోలీసులు ఐఎస్ఐ-పాకిస్తాన్ మద్దతుతో గ్రెనేడ్ దాడి మాడ్యూల్‌ను ఛేదించారు. ఈ కేసులో 10 మంది కీలక కార్యకర్తలను అరెస్టు చేశారు. వీరంతా విదేశాల్లోని హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరిపారు. పంజాబ్ పోలీస్ డిజిపి ట్వీట్ చేయడం ద్వారా ఈ ప్రధాన విజయం గురించి సమాచారం ఇచ్చారు.

పంజాబ్‌లో బయటపడ్డ మరో ఉగ్ర కుట్ర. 10 మంది ఉగ్రవాదుల అరెస్ట్!
Ludhiana Police Busts Isi
Balaraju Goud
|

Updated on: Nov 13, 2025 | 3:27 PM

Share

పంజాబ్ పోలీసులు భారీ విజయాన్ని సాధించారు. లూథియానా కమిషనరేట్ పోలీసులు ఐఎస్ఐ-పాకిస్తాన్ మద్దతుతో గ్రెనేడ్ దాడి మాడ్యూల్‌ను ఛేదించారు. ఈ కేసులో 10 మంది కీలక కార్యకర్తలను అరెస్టు చేశారు. వీరంతా విదేశాల్లోని హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరిపారు. పంజాబ్ పోలీస్ డిజిపి ట్వీట్ చేయడం ద్వారా ఈ ప్రధాన విజయం గురించి సమాచారం ఇచ్చారు.

పంజాబ్ శాంతికి భంగం కలిగించేందుకు పథకం పన్నినట్లు లూథియానా పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన నిందితులు మలేషియాలో ఉన్న ముగ్గురు ఆపరేటర్ల ద్వారా పాకిస్తాన్‌లోని హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ హ్యాండ్లర్లు వారికి హ్యాండ్ గ్రెనేడ్‌ను తీసుకొని డెలివరీ చేసే పనిని అప్పగించారు. ఈ వ్యక్తులు రద్దీగా ఉండే ప్రదేశంలో గ్రెనేడ్ దాడి చేయడమే హ్యాండ్లర్ల లక్ష్యం. ఇది రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు ఫ్లాన్ చేసినట్లు లూథియానా పోలీసులు తెలిపారు.

ఇందుకు సంబంధించి పంజాబ్ డీజీపీ ట్వీట్ చేశారు. ఒక ప్రధాన పురోగతిలో భాగంగా, లూథియానా కమిషనరేట్ పోలీసులు ISI-పాకిస్తాన్ మద్దతుగల గ్రెనేడ్ దాడి మాడ్యూల్‌ను ఛేదించి, విదేశీ హ్యాండ్లర్ల 10 మంది కార్యకర్తలను అరెస్టు చేశారని ఆయన అన్నారు. నిందితులు మలేషియాలో ఉన్న ముగ్గురు హ్యాండ్లర్ల ద్వారా పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరిపి హ్యాండ్ గ్రెనేడ్ల పికప్, డెలివరీని సమన్వయం చేసుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న ప్రాంతంలో గ్రెనేడ్ దాడి చేసే పనిని హ్యాండ్లర్లు వారికి అప్పగించారు.

బుధవారం (నవంబర్ 11 ) తెల్లవారుజామున, పంజాబ్ పోలీసుల యాంటీ-గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ (AGTF), బటాలా పోలీసుల సహకారంతో, ఒక పెద్ద ఆపరేషన్ ప్రారంభించింది. జగ్గు భగవాన్‌పురియా గ్యాంగ్‌లో చురుకైన సభ్యుడు గుర్లోవ్ సింగ్ అలియాస్ లవ్ రంధవాను అరెస్టు చేసింది. గుర్లోవ్ బటాలా నివాసి. అతని నుండి రెండు అధునాతన పిస్టళ్లు, మూడు మ్యాగజైన్‌లు, పదహారు లైవ్ కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. రెండు పోలీసు బృందాల ఉమ్మడి ప్రయత్నాలతో ఈ ఆపరేషన్ జరిగింది. పంజాబ్ పోలీసులు తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఈ చర్య గురించి సమాచారం అందించారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అనేక ముఖ్యమైన విషయాలు వెల్లడయ్యాయి. గుర్లోవ్ సింగ్ విదేశాల్లో ఉంటున్న తన హ్యాండ్లర్ అమృత్ దలం ఆదేశాల మేరకు వ్యవహరించేవాడు. అమృత్ దలం అతనికి సూచనలు అందించాడు. అతని ఆదేశాల మేరకు నేర కార్యకలాపాలకు పాల్పడ్డాడు. గుర్లోవ్‌కు సుదీర్ఘ నేర చరిత్ర ఉందని, అతనిపై అనేక కేసులు నమోదయ్యాయని కూడా పోలీసులు తెలిపారు. వీటిలో ఆయుధ చట్టం ఉల్లంఘన, దొంగతనం, దోపిడీ వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..