AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాల్లో తెలంగాణ యువత సత్తా.. ఏకంగా 43 మంది ఇంట‌ర్వ్యూకి ఎంపిక‌!

Telangana youth qualify for Civil Services interview: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్షా ఫలితాలు బుధవారం (నవంబర్‌ 12) విడుదలైన సంగతి తెలిసిందే. మెయిన్స్‌ పరీక్షలు దేశవ్యాప్తంగా ఆగస్టు 22 నుంచి 31 వరకు పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. మెయిన్స్‌ పరీక్ష ఫలితాల్లో మొత్తం 2,736 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ రౌండ్‌కు

UPSC సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాల్లో తెలంగాణ యువత సత్తా.. ఏకంగా 43 మంది ఇంట‌ర్వ్యూకి ఎంపిక‌!
Telangana selected for UPSC Civil Services interview
Srilakshmi C
|

Updated on: Nov 13, 2025 | 3:33 PM

Share

హైదరాబాద్‌, నవంబర్‌ 13: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్షా ఫలితాలు బుధవారం (నవంబర్‌ 12) విడుదలైన సంగతి తెలిసిందే. మెయిన్స్‌ పరీక్షలు దేశవ్యాప్తంగా ఆగస్టు 22 నుంచి 31 వరకు పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. మెయిన్స్‌ పరీక్ష ఫలితాల్లో మొత్తం 2,736 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ రౌండ్‌కు ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. సివిల్స్‌ మెయిన్‌ ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకంగా 43 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరంతా ఇంటర్వ్యూకు ఎంపికైనట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

రాజీవ్‌ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సహాయం పొందిన వారిలో 43మంది సివిల్స్‌లో ఇంటర్వ్యూలకు ఎంపికైనట్లు పేర్కొంది. ఇక ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా సీఎం రేవంత్‌ ఒక్కొక్కరికి మరో రూ. లక్ష చొప్పున సాయం అందించనున్నట్లు తాజాగా ప్రకటించారు. గతేడాది ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన మొత్తం 140 మంది అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. వీరిలో 20 మంది మెయిన్‌ పరీక్షలో క్వాలిఫై అయ్యారు. ఇక ఈ ఏడాది ఏకంగా మెయిన్స్‌కు 202 మంది అర్హత సాధించగా.. సీఎం రేవంత్‌ వారందరికీ రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించింది. వీరిలో ఏకంగా 43 మంది ఇంటర్వ్యూ దశకు చేరుకున్నారు. వీరందరికీ సీనియర్‌ సివిల్‌ సర్వీసెస్‌ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం మాక్‌ ఇంటర్వ్యూలు ఏర్పాటు చేస్తుంది. అలాగే ఇంటర్వ్యూ సమయంలో ఢిల్లీలో వీరికి ఉచిత వసతి సౌకర్యం అందిస్తుంది.

యూపీఎస్సీ సివిల్స్‌ 2025 మెయిన్స్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

MBBS BDS ‘స్ట్రే’ విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానం.. ఈ రోజే ఆఖరు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రైవేటు, మైనారిటీ మెడికల్ కాలేజీల్లో మూడో విడత కౌన్సెలింగ్‌ ముగిసిన సంగతి తెలిసిందే. ఇందులో మిగిలిన ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ యాజమాన్య కోటా సీట్లకు విజయవాడ డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ‘స్ట్రే’ విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది. నవంబరు 13వ సాయంత్రం 5 గంటలలోపు ఫీజు రుసుము చెల్లించి అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర సందేహాలకు 89787 80501 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించవచ్చు. దరఖాస్తు సమయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే 90007 80707 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.