UPSC Civils Free Coaching 2026: నిరుద్యోగులకు భలేఛాన్స్.. ఉచితంగా యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్! డైరెక్ట్ లింక్ ఇదే
UPSC Civil Services Free Coaching 2026 in AP: అఖిల భారత సర్వీసుల్లో పలు ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) యేటా సివిల్ సర్వీసెస్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2026 సంవత్సరానికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ క్రమంలో అభ్యర్ధులు పోటాపోటీగా..

అమరావతి, నవంబర్ 13: అఖిల భారత సర్వీసుల్లో పలు ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) యేటా సివిల్ సర్వీసెస్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2026 సంవత్సరానికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ క్రమంలో అభ్యర్ధులు పోటాపోటీగా ప్రిపరేషన్ ప్రారంభించారు. అయితే సివిల్ సర్వీసెస్ ఆశావహులైన పేదింటి అభ్యర్ధులకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు ఆంధ్రప్రేదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ బంపరాఫర్ ఇచ్చింది.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తాజాగా తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం 340 మందికి శిక్షణ ఇస్తామని తన ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు నవంబరు 13 నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్క్రీనింగ్ టెస్ట్‌లో వచ్చిన మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని ఆయన అన్నారు.
వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అభ్యర్ధులకు ఎంపిక పరీక్ష నిర్వహించి, మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారన్నమాట. మొత్తం సీటుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని వివరించారు. ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
ఏపీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ 2026 అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




