Mallikarjun Kharge: మల్లికార్జున ఖర్గేకి షాక్.. రూ.100 కోట్ల పరువు నష్టం దావా కేసులో కోర్టు సమన్లు
భజరంగ్ దళ్ వంటి సంస్థలను బ్యాన్ చేస్తామని కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మతం పేరిట ప్రజల మధ్య విధ్వేషాలు రాజేస్తున్న అలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
భజరంగ్ దళ్ వంటి సంస్థలను బ్యాన్ చేస్తామని కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మతం పేరిట ప్రజల మధ్య విధ్వేషాలు రాజేస్తున్న అలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. దీనికి సంబంధించి పంజాబ్ కోర్టు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సమన్లు జారీ చేసింది. భజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీపై వివరణ ఇవ్వాలని కోరింది. కర్ణాటక ఎన్నికల్లో భజరంగ్ దళ్‌పై కాంగ్రెస్ ఆరోపణలు ఆ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయంటూ హిందూ సురక్షా పరిషత్ వ్యవస్థాపకుడు హితేష్ భరద్వాజ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇటీవల ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో బజరంగ్ దళ్‌ను సిమి మరియు అల్-ఖైదా వంటి దేశ వ్యతిరేక సంస్థలతో పోల్చడం అభ్యంతరకరమని పిటిషనర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై సంగ్రూర్ కోర్టులో రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి సమ్మన్లు జారీ చేసింది.
భజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇవ్వడం.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పర విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..