Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka BJP: ఆపరేషన్ మొదలు పెట్టిన కమలం..! కర్నాటక బీజేపీ చీఫ్‌ కటీల్ స్థానంలో కరంద్లాజే..?

ఓటమి నుంచి కోలుకుని పార్లమెంట్‌లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది బీజేపీ. అయితే దారుణ పరాభవంపై ఆపరేషన్ షురు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇంతకాలం అధ్యక్షుడిగా ఉన్న ఆ నేతకు చెక్ పెట్టే యోచనలో..

Karnataka BJP: ఆపరేషన్ మొదలు పెట్టిన కమలం..! కర్నాటక బీజేపీ చీఫ్‌ కటీల్ స్థానంలో కరంద్లాజే..?
Nalin Kumar Kateel And Shobha Karandlaje
Follow us
Sanjay Kasula

|

Updated on: May 15, 2023 | 12:37 PM

కర్నాటక ఓటమికి కారణం ఎవరు..? ఎందుకు ఇంత స్థాయలో పడిపోయింది..? ఎవరి దూకుడు ఈ పరాభవానికి కారణం..? ఓటమిపై ఆపరేషన్ మొదలు పెట్టారు కమల పార్టీ నేతలు. ఇదిలావుంటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ ఎన్నికల పరాజయానికి బాధ్యత వహిస్తూ రాజీనామాకు సిద్ధమైనట్లుగా ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో శోభా కరంద్లాజే వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కేవలం కటీల్‌ మాత్రమే కాదు.. మోర్చా స్థాయి నుంచి పైస్థాయి వరకు ఉన్న మొత్తం బీజేపీ యూనిట్‌ను సమూలంగా ప్రక్షళనం చేయాలని బీజేపీ పెద్దలు అనుకుంటున్నట్లుగా సమాచారం. బీజేపీయే అధికారంలో ఉండాలని ఓటర్లు ఎందుకు ఒప్పించలేదో కేంద్ర నాయకత్వం విశ్లేషించిన తర్వాతే ఇది ఈ మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 28 స్థానాలకు గాను 25 సీట్లను బీజేపీ గెలుచుకునేలా చేయగల బలమైన ఆర్గనైజర్, నాయకుడు పార్టీకి కావాలి’’ అని బీజేపీ సీనియర్ కార్యకర్త ఒకరు చెప్పినట్లు కనడ మీడియాలో ప్రచారం సాగుతోంది.

కర్ణాటకలో బీజేపీ పేలవ ప్రదర్శనకు పదవీ విరమణ చేసిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇప్పటికే బాధ్యత తీసుకున్నారు. ఈ పరాజయానికి నేనే బాధ్యత వహిస్తాను. దీనికి అనేక కారణాలున్నాయి. అన్ని కారణాలను తెలుసుకుని పార్లమెంటు ఎన్నికలకు పార్టీని మరోసారి బలోపేతం చేస్తాం..” అని బసవరాజ్ బొమ్మై ప్రకటన మనకు తెలిసిందే. అయితే, రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా కటీల్‌ కొనసాగుతారని బొమ్మై తెలిపారు. అయితే ప్రతిపక్ష నేత పాత్రకు బొమ్మై గట్టి పోటీ ఇస్తున్నారు. ఎస్ సురేష్ కుమార్, అరవింద్ బెల్లాడ్, వి సునీల్ కుమార్ కూడా ఈ పదవి రేసులో ఉన్నట్లు సమాచారం.

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 66 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఇదిలావుండగా, తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకునే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఇచ్చారు. ఈ పదవికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు ముందంజలో ఉన్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ భవితవ్యం డైలామాలో పడింది. దక్షిణ కన్నడ జిల్లా నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన కటీల్ 2019 ఆగస్టులో పార్టీ అధ్యక్షుడిగా నియమితులవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. బీఎస్ యడ్యూరప్ప స్థానంలో పలువురు బీజేపీ అగ్రనేతల పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ, పార్టీ హైకమాండ్ కటీల్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్‌కు ఎంపీ సన్నిహితంగా ఉండటమే ఆయన ఈ పదవికి దక్కడానికి కారణమనం కావొచ్చని ప్రచారం జరిగింది.

బీజేపీ అధ్యక్షుడిగా మూడేళ్ల పదవీకాలం గత ఏడాదితో ముగిసినప్పటికీ.. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆయనకు పదవికాలంను పొడిగింపు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. అయితే ఓటమి నేపథ్యంలో కటీల్‌ను రానున్న రోజుల్లో భర్తీ చేయాలని భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం