Karnataka Next CM Highlights: కర్ణాటక సీఎం పదవిపై హైడ్రామా.. యూటర్న్‌ తీసుకున్న డీకే శివకుమార్‌

| Edited By: Subhash Goud

Updated on: May 15, 2023 | 9:58 PM

హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వచ్చాయి. ఓడినవాళ్లు ఎందుకు.. ఎందుకు.. ఓడామని లెక్కలేసుకుంటున్నారు. గెలిచిన వాళ్లు మాత్రం ముఖ్యమంత్రి కుర్చీ ఎవరికో అంటూ పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నారు. దీంతో, కర్నాటక రాజకీయం బెంగళూరు నుంచి హస్తినకు చేరుకుంది. మరి సీఎం ఎవరు..సిద్ధరామయ్యనా.. డికె శివకుమారా..

Karnataka Next CM Highlights: కర్ణాటక సీఎం పదవిపై హైడ్రామా.. యూటర్న్‌ తీసుకున్న డీకే శివకుమార్‌
Karnataka Cm

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పేరుపై కాంగ్రెస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆదివారం (మే 14) సీఎం పేరు విషయంలో రోజంతా ఉత్కంఠ కొనసాగింది. అంతిమంగా, రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి వదిలివేయబడింది.

కర్నాటక రాజకీయాలపై లైవ్ కోసం ఇక్కడ చూడండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 May 2023 09:46 PM (IST)

    అనారోగ్యం కారణంగానే ఢిల్లీ వెళ్లలేదు: డీకే వర్గం

    కర్ణాటక సీఎం పదవి కోసం సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సిద్ధరామయ్య.. డీకే శివకుమార్‌ మాత్రం బెంగళూరులోనే ఉన్నారు. అనారోగ్యం కారణంగా ఢిల్లీ వెళ్లలేదని డీకే శివకుమార్‌ వర్గం చెబుతోంది.

  • 15 May 2023 08:09 PM (IST)

    కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యకే ఛాన్స్‌?

    కర్ణాటక రాజకీయానికి తెరపడనుంది. సీఎం అభ్యర్థులుగా సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లు పోటీలో ఉండగా, సీఎం పదవి సిద్ధరామయ్యకే ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ వర్గాల ద్వారా సమాచారం. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

  • 15 May 2023 07:34 PM (IST)

    ఖర్గే నివాసంలో కర్నాటక నేతల భేటీ

    ఖర్గే నివాసంలో కర్నాటక నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి రణ్‌దీప్‌ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌, షిండేలు హాజరయ్యారు. సీఎం అభ్యర్థిపై చర్చ కొనసాగుతోంది.

  • 15 May 2023 07:13 PM (IST)

    యూటర్న్‌ తీసుకున్న డీకే శివకుమార్‌

    కర్నాటకలో సీఎం పదవిపై హైడ్రామా ఇంకా కొనసాగుతోంది. దీంతో డీకే శివకుమార్‌ యూటర్న్‌ తీసుకున్నారు. తాను ఢిల్లీకి వెళ్లడం లేదని శివకుమార్‌ హైకమాండ్‌కు తేల్చి చెప్పారు. ప్రస్తుతం బెంగళూరులోనే ఉన్నారు. ఆరోగ్య కారణాలతోనే వెళ్లడం లేదని డీకే స్పష్టం చేశారు.

  • 15 May 2023 06:30 PM (IST)

    ఖర్గే నివాసానికి కేసీ వేణుగోపాల్, సుశీల్ కుమార్ షిండేలు

    కర్ణాటక సీఎం కుర్చిపై ఉత్కంఠ నెలకొంది. ఈ రాజకీయం ఢిల్లీకి చేరుకున్న నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వ్యవహారం నేపథ్యంలో సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకోగా, డీకే శివకుమార్‌ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక కేసీ వేణుగోపాల్, సుశీల్ కుమార్ షిండేలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక వ్యవహారంపై సమావేశం కానున్నారు.

  • 15 May 2023 05:42 PM (IST)

    ఢిల్లీకి బయలుదేరనున్న డీకే శివకుమార్‌

    కర్ణాటక రాజకీయం రసవత్తరంగా కొనసాగుతోంది. సీఎం కుర్చి కోసం నువ్వా.. నేనా అన్నట్లు కొనసాగుతోంది. సీఎం బరిలో ఉన్న పీసీసీ చీఫ్ డికె శివకుమార్ ఢిల్లీకి బయలుదేరనున్నారు. బయలుదేరే ముందు పార్టీ హైకమాండ్ తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలని మొత్తం 135 మంది ఎమ్మెల్యేలు కోరారు. ఇందు కోసం సీఎం పదవి కోసం హైకమాండ్‌తో చర్చలు కొనసాగిస్తోంది. ఇందు కోసం ఢిల్లీకి బయలుదేరే ముందు డీకే శివకుమార్ మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తానని సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ఖర్గేకు ముందుగానే హామీ ఇచ్చానని, ఇచ్చిన హామీని నెరవేర్చానిన అన్నారు.

  • 15 May 2023 04:37 PM (IST)

    పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డా: డీకే

    పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డానని డీకే శివకుమార్ అన్నారు. సోనియా, రాహుల్‌, ఖర్గే సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నా.

  • 15 May 2023 04:35 PM (IST)

    సీఎం అభ్యర్థిని హైకమాండ్‌ నిర్ణయిస్తుంది: డీకే

    కర్ణాటక సీఎం అభ్యర్థి విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న సిద్దరామయ్య.. డీకే శివకుమార్‌ మాత్రం. ఇంట్లోనే ఉన్నారు. తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సీఎం ఎవర్నదానిపై హైకమాండ్‌ నిర్ణయిస్తుంది. కాంగ్రెస్‌ నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చాను. నా అధ్యక్షతన 135 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నా. సిద్ధరామయ్యతో ఎలాంటి విబేధాలు లేవని పేర్కొన్నారు.

  • 15 May 2023 04:33 PM (IST)

    పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా: డీకే శివకుమార్‌

    కర్ణాటక సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని అన్నారు.

  • 15 May 2023 04:19 PM (IST)

    ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలతో బొమ్మై సమావేశం

    అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బొమ్మై బెంగళూరులో ఆర్‌ఎస్‌ఎస్ నాయకులతో సమావేశం అయ్యారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తు ప్రణాళికపై ఆయన చర్చిస్తున్నారు.

  • 15 May 2023 04:17 PM (IST)

    ఢిల్లీకి చేరుకున్న సిద్ధరామయ్య

    కర్ణాటక సీఎం పంచాయతీ ఢిల్లీకి చేరుకుంది. సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకు ఢిల్లీ రావాలని కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపు రాగా, ప్రస్తుతం సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకున్నారు. రాత్రికి రాహుల్‌ గాంధీని కలువనున్నారు.

  • 15 May 2023 04:05 PM (IST)

    బీజేపీ నేతల బ్యానర్‌కు చెప్పుల దండా

    దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరులో హిందూ కంచుకోట కాంగ్రెస్‌ చేతిలో ఓడిపోయినందుకు నిరాశ చెందిన బీజేపీ నేతలు చెప్పుల దండతో కూడిన బ్యానర్‌ ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్‌ పుత్తూరులో దర్శనమిచ్చింది. పుత్తూరులో నియోజక వర్గానికి చెందిన "బాధిత హిందూ కార్యకర్తలు" ఏర్పాటు చేసిన బ్యానర్ సంచనలంగా మారింది. సెగ్మెంట్‌లో స్వతంత్ర అభ్యర్థిగా బీజేపీ ఓటమి పాలైంది. పుత్తూరులో బీజేపీ అభ్యర్థి ఆశా తిమ్మప్పగౌడ కేవలం 37,558 ఓట్లను సాధించగా, తిరుగుబాటు అభ్యర్థి అరుణ్ కుమార్ పుతిల 62,458 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్ 66,607 ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. పుత్తూరులో బీజేపీ తన సొంత క్యాడర్ నుంచి తిరుగుబాటును ఎదుర్కొంది.

    హిందుత్వ కార్యకర్త అరుణ్ కుమార్ పుత్తిలకు సీటు నిరాకరించినందుకు బాధ్యులుగా భావించే ఇద్దరు నాయకులకు ఇలా చెప్పుల దండలతో బ్యానర్‌ ఏర్పాటు చేశారు.

    Banner Of Bjp Leaders

    Banner Of Bjp Leaders

  • 15 May 2023 03:14 PM (IST)

    అవినీతి నుంచి కర్ణాటక రాష్ట్రానికి విముక్తి కల్పిస్తాం: కాంగ్రెస్

    కర్ణాటకలో కొత్త ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటవుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాల అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు. దీంతో పాటు అవినీతి ఊబి నుంచి కర్ణాటక రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామని ఆయన చెప్పారు.

  • 15 May 2023 03:09 PM (IST)

    కొత్త సీఎంపై ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడాం..

    కొత్త సీఎం ఎంపిక విషయంలో పార్టీ ఎమ్మెల్యేలందరితో మాట్లాడినట్లు కాంగ్రెస్ పరిశీలకుడు భన్వర్ జితేంద్ర సింగ్ మీడియాకు తెలిపారు. వీరి అభిప్రాయాలతో కాంగ్రెస్ అధ్యక్షుడికి నివేదికను సమర్పించనున్నట్లు చెప్పారు.

  • 15 May 2023 02:38 PM (IST)

    సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ

    కర్ణాటక రాజకీయం ఢిల్లీకి చేరుకుంది. సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లో విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఎవ్వరిని సీఎం అభ్యర్థికగా ప్రకటిస్తారనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే 2018లో ఏర్పాటైన శాసనసభ గడువు ఈ నెల 24 నాటితో ముగుస్తుంది. ఆలోగానే నూతన ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంది. వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ 136 స్థానాలతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

  • 15 May 2023 02:33 PM (IST)

    ఏఐసీసీ పరిశీలకులు బెంగళూరు నుంచి న్యూఢిల్లీకి

    సీఎల్పీ సమావేశంలో పరిశీలకులుగా నియమితులైన సుశీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వర్ జితేంద్ర సింగ్ సోమవారం మధ్యాహ్నం దేశ రాజధానికి చేరుకున్నారు. నిన్న రాత్రి నుంచి కాంగ్రెస్ హైకమాండ్‌కు నివేదిక సమర్పించనున్నారు.

  • 15 May 2023 02:31 PM (IST)

    ఎమ్మెల్యేలతో ఐదు గంటల పాటు సమావేశాలు నిర్వహించాం

    సీఎల్పీ సమావేశంలో పరిశీలకుల్లో ఒకరైన కాంగ్రెస్ నాయకుడు భన్వర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. “మేము నిన్న 4 నుంచి 5 గంటలపాటు సమావేశాలు నిర్వహించి, ఎమ్మెల్యేలందరితో మాట్లాడాము. మేము నివేదికను సిద్ధం చేశాము. దానిని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించాము. అని అన్నారు.

  • 15 May 2023 02:24 PM (IST)

    సిద్దరామయ్య కోసం పూజలు

    చిత్రదుర్గలో సిద్ధరామయ్యకు అహింద నేతలు ప్రార్థనలు చేశారు. నీలకంఠేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అదే సమయంలో సిద్ధరామయ్యకు సీఎం పదవి ఇవ్వాలని అహింద నేతలు నినాదాలు చేశారు. నాలుగు జిల్లాలకే పరిమితమైన వారిని సీఎం చేయవద్దని పట్టుబట్టారు.

  • 15 May 2023 02:10 PM (IST)

    కర్ణాటక తర్వాత తెలంగాణపై బీజేపీ ఫోకస్.. హస్తినకు ఈటెల

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంపై దృష్టిసారించినట్లు సమాచారం.  ఆ మేరకు తెలంగాణ బీజేపీ నేతలతో ఢిల్లీ పెద్దలు సంప్రదింపులు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈటెల రాజేందర్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈటెల హస్తినకు బయలుదేరి వెళ్లారు. తెలంగాణ రాజకీయలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పై ఢిల్లీ పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  • 15 May 2023 02:00 PM (IST)

    కర్నాటకలో పోస్టర్ వార్

    సిద్ధరామయ్య, శివకుమార్‌ల నివాసం వద్ద వారి మద్దతుదారులు కాంగ్రెస్‌ విజయానికి అభినందనలు తెలుపుతూ, వారిద్దరినీ తదుపరి ముఖ్యమంత్రులుగా పేర్కొంటూ బ్యానర్‌లు ఏర్పాటు చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకుంటామని, దాని ఆధారంగా అవసరమైతే తమ నాయకుడికి ఓటు వేయాలని కూడా కోరవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు సుశీల్ కుమార్ షిండే, దీపక్ బబారియా, జితేంద్ర సింగ్ అల్వార్‌లను పరిశీలకులుగా నియమించారు.

    కర్నాటక ఎన్నికల ఫలితాలు 2023 DK శివకుమార్ మరియు సిద్ధరామయ్య మద్దతుదారుల పోస్టర్ పోస్టర్ కాంగ్రెస్ CLP సమావేశం కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడానికి

  • 15 May 2023 01:51 PM (IST)

    అర్ధరాత్రి అలా.. ఇప్పుడు ఇలా.. అసలేం జరుగుతోంది..

    అర్ధరాత్రి కేక్ కట్ చేసి సిద్ధకు తినిపించిన డీకే.. ఢిల్లీకి చేరిన కర్ణాటక కుర్చీ రాజకీయం..

    DK Shivakumar Birthday: అర్ధరాత్రి కేక్ కట్ చేసి సిద్ధకు తినిపించిన డీకే.. ఢిల్లీకి చేరిన కర్ణాటక కుర్చీ రాజకీయం..

  • 15 May 2023 01:50 PM (IST)

    ఆపరేషన్ మొదలు పెట్టిన కమలం..

    ఆపరేషన్ మొదలు పెట్టిన కమలం..! కర్నాటక బీజేపీ చీఫ్‌ కటీల్ స్థానంలో కరంద్లాజే..?

    Karnataka BJP: ఆపరేషన్ మొదలు పెట్టిన కమలం..! కర్నాటక బీజేపీ చీఫ్‌ కటీల్ స్థానంలో కరంద్లాజే..?

  • 15 May 2023 01:47 PM (IST)

    హైకమాండ్‌ నన్నే సీఎం చేస్తుంది - సిద్దరామయ్య

    సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని అంటున్నారు. 85 మందికి పైగా ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారని తెలిపారు. సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలకు బ్యాలెట్‌ పోలింగ్‌ నిర్వహించారు. ఢిల్లీలో హైకమాండ్‌కు ఆ బ్యాలెట్‌ పేపర్లు చేరాయి.కాంగ్రెస్‌ హైకమాండ్‌ నన్నే సీఎం చేస్తుందని ఆశిస్తుందని సిద్దరామయ్య అనడం కొసమెరుపు

  • 15 May 2023 01:47 PM (IST)

    భజరంగ్ దళ్ బ్యాన్ హామీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడికి కోర్టు సమన్లు

    ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతున్న భజరంగ్ దళ్ వంటి సంస్థలను బ్యాన్ చేస్తామని కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి పంజాబ్‌ కోర్టు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సమన్లు జారీ చేసింది. భజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీపై వివరణ ఇవ్వాలని కోరింది. కర్ణాటక ఎన్నికల్లో భజరంగ్ దళ్‌పై కాంగ్రెస్ ఆరోపణలు ఆ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయంటూ హిందూ సురక్షా పరిషత్ వ్యవస్థాపకుడు హితేష్ భరద్వాజ్ కాంగ్రెస్ పార్టీపై సంగ్రూర్ కోర్టులో రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీనిపై వివరణ కోరుతూ ఖర్గేకి కోర్టు సమ్మన్లు జారీ చేసింది.

  • 15 May 2023 01:41 PM (IST)

    కర్ణాటక సీఎం రేసులో ఆ నలుగురు..

    కర్ణాటక సీఎం రేసులో డీకే శివకుమార్, సిద్ధరామయ్య పేర్లు ముందున్నాయి. దీంతో పాటు హెచ్‌కే పాటిల్, జీ పరమేశ్వర పేర్లు కూడా రేసులో ఉన్నాయి.

  • 15 May 2023 01:38 PM (IST)

    ముఖ్యమంత్రి పదవి విషయంలో పట్టువీడని డీకే!

    కర్ణాటక ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న డీకే శివకుమార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు విశ్వనీయ వర్గాల సమాచారం. తనను ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ అధిష్టానాన్ని డీకే కోరినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో తన వల్ల పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుందని, JDSకు ఓటు బ్యాంకుగా ఉన్న 5 శాతం వొక్కలిగ ఓట్లు కాంగ్రెస్‌కి మారాయిని డీకే తెలిపినట్లు సమాచారం. తనపై తప్పుడు ఆరోపణల కారణంగా 2013, 2014, 2015లో సిద్ధరామయ్య ఆయన ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి ఇవ్వలేదని తెలిపారు. అందుకే ముఖ్యమంత్రి పదవి విషయంలో రాజీకి సిద్ధంగా లేనని కెసి వేణుగోపాల్ ద్వారా పార్టీ అధిష్టానానికి తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.

  • 15 May 2023 01:38 PM (IST)

    ఎమ్మెల్యేల నుంచి మౌఖిక, వ్రాతపూర్వక అభిప్రాయాలు తీసుకున్నారు – బీకే హరిప్రసాద్

    రహస్య ఓటింగ్ నిర్వహించి వన్ లైన్ తీర్మానం చేశామని కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ తెలిపారు. ప్రతి ఎమ్మెల్యేతోనూ పరిశీలకులు మాట్లాడారు. వారి అభిప్రాయాన్ని మౌఖికంగా మరియు వ్రాతపూర్వకంగా తీసుకున్నారు. నిర్ణయాన్ని ఢిల్లీకి పంపారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు.

  • 15 May 2023 01:36 PM (IST)

    డీకే శివకుమార్ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

    కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ 62వ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుశీల్ కుమార్ షిండే, ఇతర నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

  • 15 May 2023 01:35 PM (IST)

    సిద్ధరామయ్యకు అనుకూలంగా ఆ నేతలు

    కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో దళిత, మైనారిటీ, గిరిజన, ఓబీసీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకు అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. చాలా మంది ఎమ్మెల్యేలు తమ ఎంపికకు బదులు హైకమాండ్‌కు అనుకూలంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

  • 15 May 2023 01:34 PM (IST)

    ఢిల్లీకి చేరుకున్న సిద్ధరామయ్య..

    కర్ణాటకలో సీఎం పదవికి పోటీ పడుతున్న సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లారు. ఇక్కడ ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలను కలుస్తారు.

  • 15 May 2023 01:32 PM (IST)

    కర్నాటక కాంగ్రెస్‌పై పెరుగుతోన్న ఒత్తిడి..

    ఓవైపు కర్నాటక కొత్త ముఖ్యమంత్రిని ఎవరిని ఎన్నుకోవాలని సతమతమవుతోన్న కాంగ్రెస్‌కు మరో అంశంలో ఒత్తిడి పెరుగుతోంది. ముస్లింల నుంచి వస్తున్న డిమాండ్‌ కాంగ్రెస్‌ను ఇబ్బంది పెడుతోంది. ముస్లింలకు డిప్యూటీ సీఎం పదవితో పాటు ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెసు పెద్దలను ముస్లిం నేతలు కోరారు. అంతేకాకుండా హోం సహా రెవెన్యూ పదవీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌ ఏం చేయనుందనేది ప్రశ్నగా మారింది.

  • 15 May 2023 01:32 PM (IST)

    కర్నాటక నెక్ట్స్ ముఖ్యమంత్రిగా ఆయనే..

    కర్నాటక నెక్ట్స్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఉంటారని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సోమవారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

  • 15 May 2023 01:29 PM (IST)

    ఢిల్లీకి చేరిన కర్నాటక రాజకీయం

    కర్ణాటకకు సీఎం కావాలని డీకే. శివకుమార్, సిద్దరామయ్య పోటీ పడుతున్నారు. తనకే సీఎం సీటు ఇవ్వాలని.. లేదు తననే సీఎం చెయ్యాలని సిద్దరామయ్య, డీకే శివకుమార్ హైకమాండ్‌పై ఒత్తిడి చేస్తున్నారు. ఇద్దరితో రాజీ చర్చలు జరపడానికి ఢిల్లీకి రావాలాని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సిద్దరామయ్య, డీకే. శివకుమార్ కు సూచించింది. అయితే ఈ ఉదయం వరకు ఢిల్లీకి వెళ్లేందుకు నో చెప్పిన డీకే చివరికి ప్రత్యేక విమానంలో హస్తినాకు బయలు దేరారు.

Published On - May 15,2023 1:28 PM

Follow us
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!