Modi KCR: ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్‌.. సీఎంను అభినందించిన మోదీ

Modi KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ కరోనాపై సలహాలు..

Modi KCR: ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్‌.. సీఎంను అభినందించిన మోదీ
Modi And KCR
Follow us
Subhash Goud

|

Updated on: May 10, 2021 | 6:17 AM

Modi KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ కరోనాపై సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇక కేసీఆర్‌ ఇచ్చిన సూచనలు పరిగణాలోకి తీసుకుంటామని,  ఆలోచనలు బాగున్నాయని మోదీ కేసీఆర్ ను అభినందించారు. కేసీఆర్ సూచనలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మోదీ తెలిపినట్లు తెలుస్తోంది.

కాగా, రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ఆదివారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే కరోనా పరిస్థితులపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన పలు అంశాలపై ఆయనతో చర్చించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌.. ప్రధానితో చర్చిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వెంటనే స్పందించారు.

అయితే రాష్ట్రానికి మరింతగా ఆక్సిజన్‌, రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు అవసరమని, త్వరగా పంపించాలని ప్రధానిని కేసీఆర్‌ విజ్ఞప్తి చేయగా, మోదీ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన సత్వరమే చర్యలు చేపడతామని సీఎంకు హామీ ఇచ్చారు ప్రధాని.

కాగా, అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో 50 వేల తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోవడంతో పాటు ఆదిలాబాద్, వరంగల్ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రెండు నెలల పాటు తెల్ల రేషన్ కార్డు దారలుకు ఒక్కరికి ఆదనంగా అయిదు కిలోల చొప్పున ఉచిత రేషన్ అందించాలని నిర్ణయించారు.

ఇవీ కూడా చదవండి:

CM KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. తెల్లరేష‌న్‌ కార్డుదారులంద‌రికీ ఉచిత బియ్యం..

హైదరాబాద్‌లో విషాదం.. ఆక్సిజన్‌ అందక కింగ్‌ కోఠి ఆస్పత్రిలో ముగ్గురు కరోనా పేషెంట్లు మృతి.. కారణం ఏంటంటే..!