Presidential Elections 2022: నేడే విపక్షాల సమావేశం.. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన ఒప్పుకుంటారా?..
Presidential Elections 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధి ఎవరు ? పవార్ ఒప్పుకుంటారా ? బుధవారం మమత నిర్వహించే సమావేశం తరువాత ఈవిషయంపై
Presidential Elections 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధి ఎవరు ? పవార్ ఒప్పుకుంటారా ? బుధవారం మమత నిర్వహించే సమావేశం తరువాత ఈవిషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విపక్షాల భేటీకి కాంగ్రెస్ కూడా హాజరవుతోంది. అవును, రాష్ట్రపతి ఎన్నికల కోసం పార్టీల్లో రాజకీయ వేడి మొదలయ్యింది. బుధవారం మమతాబెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి అతిథులు రెడీ అవుతున్నారు. శరద్‌పవార్‌ను విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలిపే యోచన ఉంది. అయితే పోటీకి సుముఖంగా లేని పవార్‌ను ఒప్పించేందుకు మమత ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ చేరుకున్న శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు మమత. తాజా రాజకీయ పరిస్థితిని చర్చించారు. అంతకుముందు పవార్ లెఫ్ట్ నేతలతో భేటీ అయ్యారు.
మమత మీటింగ్‌కు హాజరయ్యేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఓకే చెప్పింది. కాంగ్రెస్ తరపున ఖర్గే, జైరామ్‌రమేష్, సూర్జేవాలా ఈ సమావేశానికి హాజరుకాబోతున్నారు. ఎన్సీపీ నుంచి శరద్‌పవార్, ప్రఫుల్‌పటేల్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, సీపీఎం నుంచి ఎలమరం కరీం, సీపీఐ నుంచి బినోయ్ భిశ్వం, టీఆర్‌ఎస్ నుంచి వినోద్‌కుమార్, జగదీష్‌రెడ్డి హాజరవుతున్నారాని సమాచారం. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి పవార్ అంగీకరిస్తారా? లేక వేరే అభ్యర్ధిని ప్రకటిస్తారా? మమత నిర్వహించే సమావేశం తరువాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇక రాష్ట్రపతి అభ్యర్థి ఏకగ్రీవం కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. కలిసిరావాల్సిందిగా కాంగ్రెస్ సహా విపక్షాలను అడిగే చాన్స్ ఉంది. విపక్షాలతో మాట్లాడే బాధ్యతలను నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్‌కు అప్పగించారు. రాష్ట్రపతి ఎన్నికలో మెజార్టీకి స్వల్పదూరంలో ఉంది బీజేపీ. ఈ నేపథ్యంలో వైసీపీ, బీజేడీ మద్దతుతో బయటపడాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు పార్టీల నేతలతో ప్రధాని మోదీ చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి.