AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వచ్చే వారంలోనే కరోనా నిరోధక వ్యాక్సిన్‌…?

కరోనా వైరస్‌తో కకావికలం అవుతున్న ప్రపంచానికి ఓ చల్లటి వార్త చెప్పంది బ్రిటన్‌కు చెందిన ఓ పత్రిక..కరోనా వైరస్‌ను అంతం చేసే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ అతి త్వరలో అందుబాటులో రాబోతున్నదని బ్రిటన్‌ పత్రిక 'ది సన్‌' తెలిపింది..

వచ్చే వారంలోనే కరోనా నిరోధక వ్యాక్సిన్‌...?
Balu
|

Updated on: Oct 27, 2020 | 11:20 AM

Share

కరోనా వైరస్‌తో కకావికలం అవుతున్న ప్రపంచానికి ఓ చల్లటి వార్త చెప్పంది బ్రిటన్‌కు చెందిన ఓ పత్రిక..కరోనా వైరస్‌ను అంతం చేసే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ అతి త్వరలో అందుబాటులో రాబోతున్నదని బ్రిటన్‌ పత్రిక ‘ది సన్‌’ తెలిపింది.. వచ్చే వారం వ్యాక్సిన్‌ను తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలంటూ లండన్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్‌కు ఆదేశాలు కూడా వెళ్లాయట! కరోనా నిరోధక టీకాను ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందిస్తున్నాయి.. నవంబర్‌ మొదటివారంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తొలి దశ పంపిణీకి చేపట్టడానికి బ్రిటన్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ కూడా సంసిద్ధమవుతోందట! టీకాల పంపిణీ కోసం ఓ ప్రముఖ ఆసుపత్రి సిబ్బందిని వినయోగిస్తున్నారని పత్రిక పేర్కొంది. ప్రస్తుతం కరోనా వైరస్‌పై పోరాడుతున్న వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందికి టీకాలు ఇస్తారు.. ఆ తర్వాత ఇతరులకు టీకాలు వేస్తారు.. అయితే నవంబర్‌ మొదటి వారం నుంచి టీకాల పంపిణీ మొదలవుతుందన్న వార్తలపై నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ మాత్రం స్పందించలేదు.. అలాగని టీకా పంపిణీ లేదని కూడా చెప్పడం లేదు.. అయితే వచ్చే ఏడాది ప్రథమార్థంలో టీకా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు బ్రిటన్‌ ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్‌ హాన్‌కాక్‌ చెప్పడం మాత్రం గమనించదగ్గ విషయం.. ఇదిలాఉంటే తాము అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్‌ నిరోధక వ్యాక్సిన్‌ వృద్ధులలోనూ బాగా పని చేస్తున్నదని, ఈ విషయం క్లినికల్‌ టెస్టుల్లో వెల్లడయ్యిందని ఆస్ట్రాజెనెకా చెబుతోంది..

Follow Us
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...