Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
Prashant Kishor Arrest: బీహార్ రాజధాని పాట్నాలో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు సోమవారం వేకువజామున భగ్నం చేశారు. ఆయన్ను పాట్నా ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయన దీక్ష చేపట్టిన గాంధీ మైదాన్‌ను పోలీసులు ఖాళీ చేయించారు.
బీహార్ రాజధాని పాట్నాలో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు సోమవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని దీక్షా స్థలి నుంచి తరలించారు. బిహార్ పబ్లిక్‌సర్వీస్ కమిషన్-BPSC పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఈ నెల రెండోతేదీ నుంచి ప్రశాంత్ కిషోర్ నిరవధిక దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ మైదాన్‌లో ప్రకాంత్ కిషోర్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. ఆయన్ను అంబులెన్స్‌లో పాట్నా ఎయిమ్స్‌కు తరలించారు. ఆ తర్వాత గాంధీమైదాన్‌ను పోలీసులు ఖాళీ చేయించారు.
ప్రశాంత్ కిషోర్ దీక్షను భగ్నం చేసే సమయంలో పోలీసులను ఆయన మద్ధతుదారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసులు బలవంతంగా ప్రశాంత్ కిషోర్‌ను ఆంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
ప్రశాంత్ కిషోర్ దీక్షను భగ్నంచేసిన పోలీసులు..
#WATCH | BPSC protest | Bihar: Patna Police detains Jan Suraaj chief Prashant Kishor who was sitting on an indefinite hunger strike at Gandhi Maidan pic.twitter.com/cOnoM7EGW1
— ANI (@ANI) January 5, 2025
BPSC అవకతవకలపై ఈనెల 7న బిహార్ హైకోర్టులో పిటిషన్ వేస్తామని అరెస్టుకు ముందు ప్రశాంత్ కిషోర్ చెప్పారు. మరోవైపు BPSC పరీక్షను రద్దుచేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. బీపీఎస్సీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ వారికి బాసటగా నిలుస్తూ నిరవధిక నిరాహార ధీక్షకు దిగారు.