HMPV in India: దేశంలో HMPV టెర్రర్.. గుజరాత్ రాష్ట్రంలో తొలి కేసు నమోదు
హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి భారత్‌లోనూ మొదలైంది. ఇవాళ ఒక్కరోజే బెంగళూరు ఆస్పత్రిలో ఈ వైరస్ సింటమ్స్ ఇద్దరు చిన్నారుల్లో గుర్తించారు. బెంగళూరులో 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. తాజాగా గుజరాత్‌లోనూ పాజిటివ్ కేసు నమోదు అయింది. దీంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
HMPV వైరస్‌కు సంబంధించి మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. గుజరాత్ రాష్ట్రంలో తొలి హెచ్‌ఎంపీవీ వైరస్ కేసు నమోదైంది. అందుతోన్న వివరాల ప్రకారం, 2 నెలల చిన్నారి HMPV వైరస్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం పాపను అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అటు కర్నాటకలో కూడా 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకింది. ఇప్పటివరకు దేశంలో 3 కేసులు వెలుగుచూశాయి. శ్వాసకోశ వ్యాధుల విషయంలో ICMR సాధారణ పర్యవేక్షణలో భాగంగా ఈ కేసులు వెలుగు చూశాయని.. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) అనేది ఇతర శ్వాసకోశ వైరస్ లాగానే ఉంటుంది. ఇది శీతాకాలంలో జలుబు, ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది.. ప్రత్యేకించి యువకులు, వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది.. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (హెచ్‌ఎంపీవీ) కేసులేవీ నమోదు కాలేదు.
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జలుబు, ఫ్లూ లక్షణాలు కలిగి ఉన్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తుమ్ములు, దగ్గు వచ్చినపుడు చేతి రుమాలు లేదా టిష్యూ పేపర్‌ను అడ్డుపెట్టుకోవాలని, చేతులను తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలని తెలిపారు. కరచాలనం చేయడం, జబ్బు చేసిన వారి దగ్గరకు వెళ్లడం, కళ్లు, ముక్కును తరచూ తాకడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం చేయకూదడని, డాక్టర్లను సంప్రదించకుండా మందులు వాడకూడదని రవీందర్‌నాయక్ సూచించారు.
– అయితే కరోనాకు – HMPV వైరస్‌కు ఉన్న పోలికలేంటి..?
1. శ్వాసకోస సమస్య- శ్వాసవ్యవస్థపైనే వైరస్ దాడి స్వల్పస్థాయి నుంచి తీవ్రస్థాయి ఇన్ఫెక్షన్ మారే ఛాన్స్ ఉంది..
2. వైరస్ వ్యాప్తి ఎలా చెందుతుందంటే – తుమ్ములు, దగ్గుతో వ్యాప్తి చెందే అవకాశం
3. ఈ వైరస్ లక్షణాలు చూస్తే- జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాస సమస్య, ఆయాసం
4. ఇక వ్యాధిసోకే గ్రూప్‌ల విషయానికి వస్తే – పిల్లలు, వృద్ధులు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వ్యక్తులకు ఈ వ్యాధిసోకే అవకాశముంది..
5. వైరస్ నియంత్రణకు చేయాల్సిది- చేతుల శుభ్రత, మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..