Pradeep Mehra: నా దగ్గరకు రాకండి.. మీడియాకు విజ్ఞప్తి చేసిన మిడ్నైట్ రన్నర్ ప్రదీప్.. ఎందుకంటే..?
ప్రదీప్ మెహ్రా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు (Pradeep Mehra). ప్రదీప్ రన్నింగ్ చేస్తున్న వీడియోను ఫిల్మ్ మేకర్ వినోద్ కాప్రి..
ప్రదీప్ మెహ్రా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు (Pradeep Mehra). ప్రదీప్ రన్నింగ్ చేస్తున్న వీడియోను ఫిల్మ్ మేకర్ వినోద్ కాప్రి.. తన ట్విట్టర్ అకౌంట్‍లో షేర్ చేయడంతో ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది. అయితే అతడిని సెలబ్రెటీ చేసింది మాత్రం తాను చెప్పిన సమాధానాలే. ఫిల్మ్ మేకర్స్ వినోద్ కాప్రి.. నొయిడా నుంచి బరోలా మధ్య పరిగెడుతున్న ప్రదీప్ మెహ్రాను చూసి ఎందుకలా పరిగెడుతున్నావ్ అని అడిగితే.. వ్యాయమం కోసమని చెప్పాడు.. ఈ సమయంలో ఎందుకు అని అడగ్గా.. తాను మెక్ డోనాల్డ్స్ లో పనిచేస్తానని.. వ్యాయమం చేయడానికి సమయం ఉండదని.. అందుకే ఉద్యోగం పూర్తైన తర్వాత రూంకు ఇలా పరిగెత్తి చేరుకుంటానని.. దాదాపు 10 కిలోమీటర్లు పరిగెడతాని చెప్పాడు.. దీంతో అతడిని వినోద్ కాప్రి కారులో దింపుతాను అని చెప్పగా.. నా ప్రాక్టీస్ పోతుందని.. ఆర్మీలో చేరేందుకు ఇలా వ్యాయమం చేస్తున్నట్లు చెప్పాడు. ప్రదీప్ చెప్పిన సమాధానాలు ఏకంగా అతడిని సెలబ్రెటీని చేశాయి. దీంతో అతడి ఇంటర్వ్యూల కోసం మీడియా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో తన వద్దకు రావద్దంటూ ప్రదీప్ మీడియాకు విజ్ఞప్తి చేశాడు.
వీడియో వైరల్ అయిన తర్వాత ఫిల్మ్ మేకర్ వినోద్ కాప్రి.. ప్రదీప్ రియాక్షన్ గురించి తెలుసుకోవడానికి అతడిని మరోసారి కలిశాడు. ఈ క్రమంలో ప్రదీప్ మాట్లాడుతూ.. అతిగా ఫేమ్ దక్కినా ఇబ్బందే.. ఇంటర్వూల కోసం రావడం.. నన్ను సెలబ్రెటీగా మార్చేయడమో చేస్తారు. అప్పుడు నా లక్ష్యం పై నేను దృష్టి పెట్టలేను.. అందుకే దయచేసి మీడియా వారు నా వద్దకు రావొద్దూ.. ప్రశాంతంగా నా పని నన్ను చేసుకోనివ్వండి అంటూ వేడుకున్నాడు. నా శ్రమ నిశబ్ధంగానే సాగిపోవాలి.. ఎందుకంటే నా విజయాన్ని నేను ప్రపంచానికి బిగ్గరగా సాటి చెప్పాలి కదా.. అందుకే ఇలాంటి ఫేమ్ లకు దూరంగా ఉండాలనుకుంటున్నాను.. సెల్ఫీల కోసం వస్తుంటే సిగ్గుగా అనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది ఇంటర్వ్యూలు అంటూ ఇబ్బంది పెడుతున్నారు.. నా తల్లి చికిత్సకు సాయం చేసినవారికి కృతజ్ఞతలు.. ఇక చాలు ఇంకేం వద్దు.. నా లక్ష్యం దేశ సేవే అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రదీప్ మనస్తత్వానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
This is PURE GOLD❤️❤️
नोएडा की सड़क पर कल रात 12 बजे मुझे ये लड़का कंधे पर बैग टांगें बहुत तेज़ दौड़ता नज़र आया
मैंने सोचा किसी परेशानी में होगा , लिफ़्ट देनी चाहिए
बार बार लिफ़्ट का ऑफ़र किया पर इसने मना कर दिया
वजह सुनेंगे तो आपको इस बच्चे से प्यार हो जाएगा ❤️? pic.twitter.com/kjBcLS5CQu
— Vinod Kapri (@vinodkapri) March 20, 2022
“मेहनत सुनसान होनी चाहिए, कामयाबी का शोर होना चाहिए”
ये कहते हुए #PradeepMehra ने मीडिया से अपील की है कि वो उसे उसके लक्ष्य में फ़ोकस रहने दे और परेशान ना करें???? pic.twitter.com/B6OptUQ8Je
— Vinod Kapri (@vinodkapri) March 21, 2022
Also Read: Viral Photo: ఈ ఫోటోలో ఉన్న పర్సన్.. మీ, మా, మనందరి ఫేవరెట్.. ఎవరో గుర్తుపట్టారా..?
OTT Platforms: ఓటీటీ వేదికపై సందడి చేయనున్న పెద్ద సినిమాలు ఇవే.. స్ట్రీమింగ్ డేట్స్ ఏంటంటే..
Ghani Movie: ఫ్యాన్స్‌కు గని నుంచి స్పెషల్ ట్రీట్.. తమన్న స్టెప్పులకు ఫిదా అవుతోన్న కుర్రకారు..
RRR: విడుదలకు ముందే ఊచకోత.. ప్రీమియర్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ల సునామీ.. ఆ రికార్డ్ బ్రేక్