ఆ ప్రాంతంలోకి పోవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాలి.. కారణం ఇదే..
హిడ్మా..ఈ పేరు వింటేనే దండకారణ్యం ఉలిక్కి పడుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతూ.. వారికి చిక్కకుండా తన ప్రణాళికలు అమలు చేస్తూ.. తప్పించు కుంటున్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత. వందలాది మంది సైనికులను హతమార్చి దేశంలోని మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు జాబితాలో ఉన్న హిడ్మా స్వగ్రామంలో తొలిసారి కేంద్ర బలగాలు పోలీస్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో పువ్వర్తి గ్రామం పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం.

హిడ్మా..ఈ పేరు వింటేనే దండకారణ్యం ఉలిక్కి పడుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతూ.. వారికి చిక్కకుండా తన ప్రణాళికలు అమలు చేస్తూ.. తప్పించు కుంటున్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత. వందలాది మంది సైనికులను హతమార్చి దేశంలోని మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు జాబితాలో ఉన్న హిడ్మా స్వగ్రామంలో తొలిసారి కేంద్ర బలగాలు పోలీస్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో పువ్వర్తి గ్రామం పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ప్రాంతంలోకి పోవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోవాల్సిందే. కొత్త వ్యక్తులు ఎవరైనా గ్రామ పొలిమేరలో కనిపిస్తే అక్కడి మిలీషియా సబ్యుల అనుమతి లేకుండా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఒకప్పుడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హిడ్మా స్వగ్రామం పువ్వర్తిలో ఏకంగా భద్రతా బలగాలు మోహరించాయి.
పువ్వర్తిలో నక్సల్స్ సాగు చేస్తున్న వ్యవసాయ భూములను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కాకులు దూరని దండకారణ్యంలో నేడు పోలీసులు అడుగు ముందుకు వేసి రహదారి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టారు. పువ్వర్తి గ్రామంలో పోలీసు శిబిరం ఏర్పాటు సందర్భంగా సీఆర్పీఎఫ్ డీఐజీ అరవింద్ రాయ్, సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్లు సందర్శించారు. 40 సంవత్సారాలు తర్వాత ఆ ప్రాంతంలో పోలీసులు తొలిసారి జాతీయ జెండాను ఎగుర వేశారు. జాతీయ జెండా ఎగుర వేయడం తమ విజయంగా చెబుతున్నారు పోలీసు అధికారులు. ఈ గ్రామానికి చెందిన హిడ్మా 1996లో తన 16వ ఏట మావోయిస్టు పార్టీలో చేరి గ్రామ కమిటీ నుంచి సెంట్రల్ కమిటీ మెంబర్గా అంచెలంచెలుగా ఎదిగారు. దాదాపు 45పైగా దాడుల్లో పాల్గొన్నారు. అతని నేతృత్వంలో తాడి మెట్లలో జరిగిన దాడిలో 78 మంది జవాన్లు మృతి చెందారు. ఇతనిపై ఛత్తీస్ఘడ్ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. దట్టమైన దండకారణ్యంలో ఉండే ఈ ప్రాంతం మావోయిస్టులకు ఓ కోటగా మారింది. హిడ్మా తల్లిని కూడా సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు కలిశారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి, మౌళిక సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. హిడ్మా స్వగ్రామంలో క్యాంపు ఏర్పాటు చేసి.. జాతీయ జెండా ఎగర వేయడంతో భద్రతా బలగాలుపై చేయి సాధించినట్లైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..