AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: పార్టీ బలోపేతానికి హీరో విజయ్ కీలక సమావేశం.. తీసుకున్న నిర్ణయాలివే..

తమిళనాడులో కొత్త పార్టీల పర్వం కొసాగుతోంది. మాస్ హీరోగా పేరున్న తమిళ హీరో విజయ్ కొత్త పార్టీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లోకి రావాలని తన అభిమానులు కోరినప్పటికీ లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తా అన్న ఫార్ములాతో దూసుకెళ్తున్నారు. పార్టీ దీర్ఘకాలం మనుగడ కొనసాగేలా, పూర్తి స్థాయిలో బలం చేకూర్చుకునేందుకు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఎన్నికలకు ముందు కొత్త ఓటర్లు సభ్యత్వం తీసుకుంటారని, వారిని లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగాలని నిర్ణయించారు.

Tamil Nadu: పార్టీ బలోపేతానికి హీరో విజయ్ కీలక సమావేశం.. తీసుకున్న నిర్ణయాలివే..
Hero Vijay
Srikar T
|

Updated on: Feb 19, 2024 | 4:48 PM

Share

తమిళనాడులో కొత్త పార్టీల పర్వం కొసాగుతోంది. మాస్ హీరోగా పేరున్న తమిళ హీరో విజయ్ కొత్త పార్టీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లోకి రావాలని తన అభిమానులు కోరినప్పటికీ లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తా అన్న ఫార్ములాతో దూసుకెళ్తున్నారు. పార్టీ దీర్ఘకాలం మనుగడ కొనసాగేలా, పూర్తి స్థాయిలో బలం చేకూర్చుకునేందుకు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఎన్నికలకు ముందు కొత్త ఓటర్లు సభ్యత్వం తీసుకుంటారని, వారిని లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగాలని నిర్ణయించారు. అలాగే మహిళలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. దీంతో పాటు జిల్లాల వ్యాప్తంగా పార్టీ క్యాడర్ పై దృష్టి సారించాలని ముఖ్య సభ్యలకు సూచించారు. జిల్లాల వారిగా నమోదైన కొత్త ఓటర్ల జాబితాపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. విజయ్ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు. బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్టీలో ఏ విషయంలోనైనా అధ్యక్షుడి నిర్ణయమే ఫైనల్ అనేలా ముందుకు సాగాలన్నారు. 2026 ఎన్నికలే టార్గెట్‎గా ముందుకు వెళ్లాలని దిశానిర్ధేశం చేశారు.

2024లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వకూడదని కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదుకు క్యాంపులు ఏర్పాటు చేయాలని పార్టీ ముఖ్య నాయకులకు ఆదేశించారు. అందుకోసం పార్టీలో కొందరు మహిళలకు నియామకాలు చేపట్టాలని తెలిపారు. వీరితో ప్రత్యేకంగా మహిళా విభాగం ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నట్లు సమాచారం. 2 కోట్ల మందిని పార్టీ సభ్యులుగా చేర్చాలని అందుకు తగిన కార్యాచరణను మార్గదిర్ధేశం చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో దళపతిగా పేరున్న విజయ్ ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కళగం అనే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. గత కొంత కాలంగా ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఉన్న విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలు ఉన్నప్పటకీ వాటిని త్వరితగతిన పూర్తిచేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ తరుణంలోనే పార్టీ ముఖ్య సభ్యులతో కీలక సమావేశం నిర్వహించి ఈ నిర్ణయాలు తీసుకోవడం తమిళనాడులో రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..