Delhi: ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి.. విద్యార్థులతో మాటామంతి
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ఉదయం పితాంపురలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రిఫెషనల్ స్టడీస్‌కు ఢిల్లీ మెట్రోలో వెళ్లారు. ఈ సందర్భంగా మెట్రోలో ప్రయాణిస్తున్న విద్యార్థులతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో...
నిత్యం ప్రయాణికులతో బిజీబిజీగా ఉండే మెట్రో రైలులో రాజకీయ ప్రముఖులు ప్రయాణం చేయడం ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో ప్రముఖులు సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే మొన్నటిమొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయణించిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా ఢిల్లీ మెట్రోలో ప్రయణించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ఉదయం పితాంపురలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రిఫెషనల్ స్టడీస్‌కు ఢిల్లీ మెట్రోలో వెళ్లారు. ఈ సందర్భంగా మెట్రోలో ప్రయాణిస్తున్న విద్యార్థులతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పలు అంశాలపై చర్చించారు. అదేవిధంగా మెట్రో పనితీరు, ఇతర వివరాలను కూడా సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి ఢిల్లీ రైడ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Delhi: Union Education Minister Dharmendra Pradhan took Delhi metro to Vivekananda Institute of Professional Studies, Pitampura, earlier today. pic.twitter.com/2fuB7ICjr1
— ANI (@ANI) February 19, 2024
#WATCH | Delhi: Union Education Minister Dharmendra Pradhan takes Delhi metro to Vivekananda Institute of Professional Studies, Pitampura pic.twitter.com/vIVlUaXZ2p
— ANI (@ANI) February 19, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..