AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: ఆ పార్టీలది విష రాజకీయం.. వారి ఉచ్చులో పడకండి: ప్రధాని మోడీ

014 తర్వాత కేంద్ర ప్రభుత్వ పాలనపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందంటూ వ్యాఖ్యానించారు. జైపూర్‌లో జరిగిన బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.

PM Narendra Modi: ఆ పార్టీలది విష రాజకీయం.. వారి ఉచ్చులో పడకండి: ప్రధాని మోడీ
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: May 20, 2022 | 1:39 PM

Share

PM Modi Speech: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్ష పార్టీలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ పార్టీలది విష రాజకీయమని.. వారి ఉచ్చులో పడకండి అంటూ ప్రధాని మోడీ.. బీజేపీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఎ ప్రభుత్వం ఎనిమిదేళ్లపాటు దేశ సమతుల్య అభివృద్ధి, సామాజిక న్యాయం, సామాజిక భద్రతకు అంకితమైందని మోడీ పేర్కొన్నారు. 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వ పాలనపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందంటూ వ్యాఖ్యానించారు. జైపూర్‌లో జరిగిన బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పేద, అర్హులైన లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి.. దీనికోసం అన్ని చోట్ల ప్రచారం ప్రారంభించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

ఈ నెలతో ఎన్‌డీఏ ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకోనుందని, ఈ ఎనిమిదేళ్లు తీర్మానాలు, విజయాలతో గడిచిపోయాయని మోడీ పేర్కొన్నారు. ఈ ఎనిమిదేళ్లు సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేశామని.. అదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.

చిన్న రైతులు, కూలీలు, మధ్యతరగతి ప్రజల ఆశలు ఎనిమిదేళ్లలో నెరవేరాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఎనిమిదేళ్లు దేశ సమతౌల్య అభివృద్ధి, సామాజిక న్యాయం, సామాజిక భద్రతకు సంబంధించినవని.. ఈ ఎనిమిదేళ్లు తల్లులు, కుమార్తెలు, సోదరీమణుల సాధికారత కోసం అంకితభావంతో పని చేశామన్నారు.

ఇవి కూడా చదవండి

2014 తర్వాత బీజేపీ ప్రభుత్వం.. పాలన పరంగా, వ్యవస్థల పనితీరుపై గతంలో కోల్పోయిన విశ్వాసాన్ని పునరుద్ధరించిందని ప్రధాని స్పష్టంచేశారు. తీసుకొచ్చిన సంస్కరణలు, చేపట్టిన అభివృద్ధితో ప్రపంచం మొత్తం నేడు భారత్‌ వైపు చూస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

భారత్‌లో కూడా బీజేపీ అంటే ప్రజలకు ప్రత్యేక అభిమానం ఉందని మోడీ పేర్కొన్నారు. దేశ ప్రజలు బీజేపీని ఎంతో విశ్వాసంతో, ఆశతో చూస్తున్నారని అన్నారు. 2014 తర్వాత బీజేపీ ప్రజలను నిరాశా నిస్పృహల నుంచి బయటకు తీసుకొచ్చిందని, నేడు ప్రజలు నెరవేరిన ఆకాంక్షలను చూస్తున్నారని ప్రధాని అన్నారు.

దేశ ప్రజల ఈ ఆశలు, ఆకాంక్షలు మన బాధ్యతను మరింతగా పెంచుతున్నాయని బీజేపీ కార్యవర్గ సభ్యులతో మోడీ పేర్కొన్నారు.75వ స్వాతంత్య్ర సంవత్సరంలో.. దేశం రాబోయే 25 ఏళ్ల లక్ష్యాలను నిర్దేశిస్తోందని మోడీ పేర్కొన్నారు. రాబోయే 25 ఏళ్ల లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి కోసం నిరంతరం శ్రమించాల్సిన సమయం బీజేపీకి ఉందని ఆయన పేర్కొన్నారు.

కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విషం చిమ్మేందుకు చిన్నచిన్న ఉద్రిక్తతలను వెతుక్కుంటూ ఉంటాయని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. మోడీ ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు.

దేశాభివృద్ధి లాంటి అంశాల నుంచి తప్పుదోవ పట్టించే విధంగా.. కొన్ని ప్రయత్నాలు జరుగుతాయని.. అలాంటి విష రాజకీయాల ఉచ్చులో పడొద్దని ప్రధాని మోడీ బీజేపీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...