AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wheatgrass Juice: గోధుమ గడ్డి జ్యూస్‌తో బోలెడన్ని ప్రయోజనాలు.. ఆ రెండు రాకాసి వ్యాధులకు చెక్..

గోధుమ గడ్డితో ఆరోగ్యానికి చాలా ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులతో ఉపశమనాన్ని కలిగించడమే కాకుండా.. అధిక బరువును కూడా నియంత్రిస్తుంది.

Wheatgrass Juice: గోధుమ గడ్డి జ్యూస్‌తో బోలెడన్ని ప్రయోజనాలు.. ఆ రెండు రాకాసి వ్యాధులకు చెక్..
Wheatgrass Juice
Shaik Madar Saheb
|

Updated on: May 20, 2022 | 9:22 AM

Share

Wheatgrass Juice For Diabetic Patients: నానాటికీ డయాబెటిస్ బాధితులు పెరుగుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని.. డైట్‌లో పలు పదార్థాలను చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి డయాబెటిస్ కంట్రోల్ పదార్థాల్లో ఒకటి గోధుమ గడ్డి జ్యూస్. గోధుమ గడ్డితో ఆరోగ్యానికి చాలా ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులతో ఉపశమనాన్ని కలిగించడమే కాకుండా.. అధిక బరువును కూడా నియంత్రిస్తుంది. గొధుమ గడ్డి జ్యూస్‌తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

గోధుమ గడ్డి రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

గోధుమ గడ్డిలో ప్రోటీన్, ఫ్లేవనాయిడ్స్, క్లోరోఫిల్, విటమిన్-సి, విటమిన్-ఇ, మినరల్స్, ఫైబర్, యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ప్రతిరోజూ తాగితే, శరీరంలోని అన్ని పోషకాల లోపం తీరుతుంది. ఆరోగ్యవంతంగా ఉండవచ్చు

ఇవి కూడా చదవండి

మధుమేహ రోగులకు ఉపశమనం

గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని క్రమం తప్పకుండా తాగాలని సూచిస్తున్నారు. ఎందుకంటే షుగర్ ను నియంత్రించకపోతే శరీరం అనారోగ్యానికి గురవుతుంది.

బరువు తగ్గడంలో ప్రభావవంతంగా ఉంటుంది..

గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల స్థూలకాయం తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి.. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల ఎక్కువసేపు ఆకలి అనిపించదు. చాలాసేపు కడుపు నిండినట్లు అనిపించడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకోరు. కావున క్రమంగా బరువు తగ్గుతారు.

అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది..

గోధుమ గడ్డి రసం తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచదు. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోేద.. అది అధిక రక్తపోటుకు కారణమవడంతోపాటు గుండెపోటుకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బాడీ డిటాక్స్..

గోధుమ గడ్డి రసంలో క్లోరోఫిల్ పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా శరీరంలోని టాక్సిన్స్ బయటకు వస్తాయి. బాడీ డిటాక్స్ కావడం వల్ల కాలేయం సక్రమంగా పనిచేసి జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇది కాకుండా శరీరం మరింత శక్తిని పొందుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..