Summer Tips: చెమట దుర్వాసన కంపు కొడుతోందా?.. ఈ టిప్స్‌తో చెక్ పెట్టండి..

విపరీతమైన చెమట, దుర్వాసనకు చెక్ పెట్టాలంటే.. కొన్ని చిట్కాలను పాటించడం మంచిది. దీని ద్వారా ఈ సమస్యను వదిలించుకోవచ్చు..

Summer Tips: చెమట దుర్వాసన కంపు కొడుతోందా?.. ఈ టిప్స్‌తో చెక్ పెట్టండి..
Excessive Sweating
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 20, 2022 | 9:56 AM

Excessive Sweating home remedies: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓ వైపు వేడి, మరోవైపు తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వేడి గాలులు, ఉక్కపోత కారణంగా శరీరం నుంచి చెమట రావడం సర్వసాధారణం. అయితే.. కానీ కొంతమందికి విపరీతమైన చెమటలు వస్తుంటాయి. ఇది శరీర దుర్వాసనకు కారణమవుతుంది. దీంతో చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలగుతుంది. అయితే.. విపరీతమైన చెమట, దుర్వాసనకు చెక్ పెట్టాలంటే.. కొన్ని చిట్కాలను పాటించడం మంచిది. దీని ద్వారా ఈ సమస్యను వదిలించుకోవడంతోపాటు రోజంతా హాయిగా ఉండవచ్చు.. అవేంటో తెలుసుకుందాం..

ఎక్కువగా చెమట పట్టి దుర్వాసన వస్తున్నట్లయితే ఈ చిట్కాలు పాటించండి..

సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి

ఇవి కూడా చదవండి

ఫ్యాషన్ యుగంలో ట్రెండీగా కనిపించాలనే ఉద్దేశ్యంతో వేసవిలో కూడా బిగుతుగా.. నల్లగా ముదురు రంగులో ఉండే దుస్తులను ధరిస్తుంటారు. దీని కారణంగా శరీరంలోని చాలా భాగాలకు గాలి చేరకపోవడంతోపాటు విపరీతమైన చెమట పడుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు వదులుగా, సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ధరించడం మంచిది.

కొవ్వు పదార్థాలు తినవద్దు..

వేసవిలో ఆహారం, పానీయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నూనె ఎక్కువగా ఉండే వాటికి దూరంగా ఉండాలి. కొవ్వు పదార్థాలు తినడం వల్ల అధికంగా చెమట పడుతుంది. దీని కారణంగా శరీరం నుంచి వాసన కూడా వస్తుంది.

టెన్షన్ ఫ్రీగా ఉండండి..

వేడి కారణంగా టెన్షన్, నీరసం లాంటివి కనిపిస్తాయి. అయితే.. ఒత్తిడి వల్ల చెమట పట్టడం మరింత పెరుగుతుంది. కావున వీలైనంత వరకు రిలాక్స్ మైండ్‌తో కూల్‌గా ఉండేందుకు ప్రయత్నించాలి.

రాత్రిపూట ఈ పని చేయండి..

వేసవిలో తలస్నానం చేసి పడుకునే ముందు అండర్ ఆర్మ్స్ పై డియోడరెంట్ రాసుకుంటే చెమట తగ్గుతుంది. ఇలా కొన్ని రోజులు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..