AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liposuction: కన్నడ నటి మృతికి కారణమిదే.. లైపోసెక్షన్‌ చికిత్సపై షాకింగ్ విషయాలు చెప్పిన నిపుణులు..

ఆమె 'కొవ్వు రహిత' ప్లాస్టిక్ సర్జరీ (fat-free plastic surgery) అనంతరం పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. కాగా.. ఫ్యాట్-ఫ్రీ ప్లాస్టిక్ సర్జరీ లేదా లైపోసక్షన్ అనేది శరీర ఆకృతి లేదా వారి అందాన్ని మెరుగుపరచడానికి ఒక మార్గం.

Liposuction: కన్నడ నటి మృతికి కారణమిదే.. లైపోసెక్షన్‌ చికిత్సపై షాకింగ్ విషయాలు చెప్పిన నిపుణులు..
Liposuction Surgery
Shaik Madar Saheb
|

Updated on: May 20, 2022 | 11:47 AM

Share

Liposuction Surgery: శరీరంలోని అదనపు కొవ్వును తొలగించుకుని మరింత అందంగా కనిపించాలని పలువురు ఎలా పడితే అలా సర్జరీలను చేయించుకుంటూ ప్రమాదంలో పడుతున్నారు. తాజాగా.. కోలీవుడ్‌కు చెందిన ఓ యువ నటి జీవితం అర్ధాంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. ప్లాస్టిక్ సర్జరీ వికటించి 22 ఏళ్ల కన్నడ టీవీ నటి చేతన రాజ్ రెండు రోజుల క్రితం బెంళగూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించింది.. ఆమె ‘కొవ్వు రహిత’ ప్లాస్టిక్ సర్జరీ (fat-free plastic surgery) అనంతరం పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. కాగా.. ఫ్యాట్-ఫ్రీ ప్లాస్టిక్ సర్జరీ లేదా లైపోసక్షన్ అనేది శరీర ఆకృతి లేదా వారి అందాన్ని మెరుగుపరచడానికి ఒక మార్గం. దీనిపై.. వసంత్‌ కుంజ్‌లోని ఫోర్టిస్‌ హాస్పిటల్‌లోని ప్లాస్టిక్‌ సర్జరీ సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ రష్మీ తనేజా (Dr Rashmi Taneja) తాజాగా న్యూస్9 లైవ్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. శరీరంలో.. తొడలు, తుంటి, పిరుదులు, ఉదరం, చేతులు, మెడ లేదా వీపు వంటి పలు భాగాల్లోని కొవ్వును తొలగించేందుకు లైపోసక్షన్, ఫ్యాట్-ఫ్రీ ప్లాస్టిక్ సర్జరీలను చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సర్జరీలకు సంబంధించిన పలు విషయాలను పంచుకోవడంతోపాటు.. అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

‘‘బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 30 కంటే తక్కువ ఉన్న అధిక బరువు ఉన్నవారు ఈ శస్త్రచికిత్స చేయించుకుంటారు. ఇలాంటి వ్యక్తులు డైటింగ్, వ్యాయామం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ కొవ్వును మాత్రం వదిలించుకోలేరు’’ అని తనేజా తెలిపారు.

కొవ్వును నియంత్రించుకున్న.. ఊబకాయం ఉన్న వ్యక్తి కూడా లైపోసక్షన్ చేయించుకోవచ్చా.?

ఇవి కూడా చదవండి

ఎక్కువగా కొవ్వు తొలగిస్తే.. అధిక ప్రమాదం..

స్థూలకాయానికి లైపోసక్షన్ పరిష్కారం కాదని డాక్టర్ తనేజా స్పష్టం చేశారు. “ఊబకాయానికి సంబంధించిన అనేక వైద్యపరమైన సమస్యలు ఉన్నాయి. ఒక వ్యక్తి BMI (బాడీ మాస్ ఇండెక్స్) 30 కంటే ఎక్కువ ఉంటే.. వారికి లైపోసక్షన్ ద్వారా వెళ్ళమని సలహా ఇవ్వరు. ఎందుకంటే వ్యాధి శస్త్రచికిత్స ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఎక్కువ కొవ్వు తొలగిస్తే.. మరింత ప్రమాదం ఏర్పడుతుంది..’’ అని పేర్కొన్నారు.

“లైపోసక్షన్ అనేది కొవ్వు నిల్వలను తగ్గించుకునేందుకు ఒక పద్దతి.. అంతే కానీ ఇది బరువు తగ్గించే చికిత్స కాదు. ఊబకాయం ఉన్నవారికి అటువంటి శస్త్రచికిత్స చేయించుకోవడం అంటే మీ శరీరాన్ని 360 డిగ్రీలు మార్చడం.. ఇది బహుళ ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. ఇది తీవ్రమైన ప్రమాదాలు.. సంభావ్య సమస్యలను కలిగిస్తాయి.. దానిని పరిగణనలోకి తీసుకునే ముందు మీ వైద్యునితో మాట్లాడటం చాలా ముఖ్యం” అని తనేజా పేర్కొన్నారు.

అయితే.. స్థూలకాయులు బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకోవచ్చని ఆమె సలహా ఇచ్చారు. ఇది బరువు-సంబంధిత సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది. దీంతోపాటు వ్యక్తికి పూర్తి, శాశ్వత బరువు తగ్గడానికి రూపొందించిన సాంకేతికతలతో ఉంటుంది.

బేరియాట్రిక్ సర్జరీ..

బేరియాట్రిక్ సర్జరీ.. శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు మొత్తాన్ని ఉపయోగించుకునేలా చేస్తుంది. తద్వారా శారీరం నుంచి క్రమంగా నియంత్రిత బరువు తగ్గుతుంది. ఇది టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, జాయింట్ ఆర్థరైటిస్, స్లీప్ అప్నియా, PCOS, కొన్ని క్యాన్సర్‌లు వంటి వాటితో పాటు బరువు తగ్గిస్తుంది. అలాగే.. బరువు సంబంధిత వ్యాధులను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.

బారియాట్రిక్ శస్త్రచికిత్స అనేది బరువు, బరువు-సంబంధిత సహ-అనారోగ్యాలను తగ్గించే ఉద్దేశ్యంతో చేసే ఒక రకమైన జీర్ణశయాంతర శస్త్రచికిత్స. అయితే, లైపోసక్షన్ అనేది శరీర ఆకృతి, అందాన్ని పెంపొందించడం కోసం చేసే సౌందర్య శస్త్రచికిత్స.

ఒకే సిట్టింగ్‌లో లైపోసక్షన్ పూర్తి చేయడం ముఖ్యం..

దీనిపై డాక్టర్ తనేజా ఇంకా మాట్లాడుతూ.. లైపోసక్షన్ సర్జరీలో ప్రమాదాలను తగ్గించడానికి, ఒకే సిట్టింగ్‌లో శస్త్రచికిత్స పూర్తి చేయడం చాలా ముఖ్యమని చెప్పారు. “లైపోసక్షన్‌లో రక్తం గడ్డకట్టడం, రక్తస్రావం, వివిధ శరీర భాగాలలో ద్రవం చేరడం వంటి ప్రమాదాలు అధికంగా ఉంటాయి.” అని పేర్కొన్నారు.

Source Link

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..