Lokesh: “హత్యలు, అరాచకాలు చేసుకోమని వైసీపీ నేతలకు లైసెన్స్ ఇచ్చారా.?”.. టీడీపీ లీడర్ లోకేశ్ ఫైర్
ఎమ్మెల్సీ(MLC) అనంతబాబు వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంది ముమ్మాటికి హత్యేనని టీడీపీ లీడర్ నారా లోకేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను బిహార్ కంటే దారుణమైన స్థితికి తీసుకువచ్చారని వైసీపీ పాలనపై మండిపడ్డారు. వైసీపీ(YCP) నేతల నేరాలకు....
ఎమ్మెల్సీ(MLC) అనంతబాబు వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంది ముమ్మాటికి హత్యేనని టీడీపీ లీడర్ నారా లోకేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను బిహార్ కంటే దారుణమైన స్థితికి తీసుకువచ్చారని వైసీపీ పాలనపై మండిపడ్డారు. వైసీపీ(YCP) నేతల నేరాలకు సామాన్య ప్రజలు బలైపోతున్నారని విమర్శించారు. తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంను అత్యంత దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు, యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దారుణమని రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస క్రీడకు అద్దం పడుతోందని ఆగ్రహం చెందారు. ఎమ్మెల్సీ అనంత బాబు తమ కుమారుడ్ని బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశారని మృతుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా అతణ్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులకు హత్యలు, అరాచకాలు చేసుకోమని స్పెషల్ లైసెన్స్ ఏమైనా ఇచ్చారా అని నిలదీశారు. సుబ్రహ్మణ్యంను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు, అతని అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టి.. కుటుంబానికి ఆసరాగా ఉన్న కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులను ఆదుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
కాకినాడ జిల్లా 2 టౌన్ పరిధి వివేకానంద పార్క్ వీధిలో ఎమ్మెల్సీ అనంతబాబు కారులో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు సుబ్రహ్మణ్యం.. గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్‌గా పని చేశాడు. అయితే, రాత్రి 10.30 గంటల ప్రాంతంలో అనంతబాబు వచ్చి ఆయన కారులోనే తమ అబ్బాయిని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అర్థరాత్రి 1 గంటల సమయంలో మీ అబ్బాయి టిఫిన్ కోసం బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి చనిపోయాడని, డెడ్ బాడీని ఇంటికి తీసుకువచ్చినట్లు ఎమ్మెల్సీ చెప్పారని బాధిత కుటంబ సభ్యులు తెలిపారు.
అయితే, అనంతబాబు తిరిగి వెళ్తుండగా అడ్డుకోవడంతో కారు వదిలి పరారయ్యాడని మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. యువకుడు కాళ్లు, చేతులు విరిచి మట్టిలో దొర్లించి కొట్టి చంపారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, తమ కుమారుడిని చంపేసిన ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
Biden Tour – Kim Alert: బైడెన్ టూర్.. భయపెడుతున్న కిమ్.. ఏం జరుగుతుందోనని టెన్షన్ టెన్షన్..!
Jyeshtha Masam: గ్రహ దోషాలు తొలగిపోవాలంటే జ్యేష్ఠ మాసంలో ఈ మూడు పనులు చేయండి..