AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ACB Trap: ఇలా ముదిరిపోయారేంట్రా బాబూ.. టెక్నాలజీ సాయం అధికారులకే షాక్ ఇచ్చిన కేటుగాళ్లు..

ACB Trap: కేటుగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అధికారులపైనే బెదిరింపులకు దిగుతున్నారు.

ACB Trap: ఇలా ముదిరిపోయారేంట్రా బాబూ.. టెక్నాలజీ సాయం అధికారులకే షాక్ ఇచ్చిన కేటుగాళ్లు..
Fake
Shiva Prajapati
|

Updated on: May 20, 2022 | 10:01 AM

Share

ACB Trap: కేటుగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అధికారులపైనే బెదిరింపులకు దిగుతున్నారు. ఏసీబీ పేరుతో జగిత్యాల జిల్లాలో భారీ ఫ్రాడ్‌ జరిగింది. జగిత్యాల జిల్లాలో ఏసీబీ డీఎస్పీ పేరుతో వస్తోన్న బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ తహశీల్దార్ల గుండెల్లో భయాందోళనలు రేపుతున్నాయ్‌. ఒకరికో, ఇద్దరికో కాదు, జిల్లాలోని ఎమ్మార్వోలందరినీ ఏసీబీ పేరుతో బెదిరిస్తున్నాడు అగంతకుడు. ఒకరికి తెలియకుండా మరొకరికి ఫోన్‌ చేస్తూ మొత్తం అందరినీ భయపెడుతున్నాడు. మీపై అలిగేషన్స్‌ వచ్చాయ్‌? బాధితులు కంప్లైంట్ చేశారు? అడిగినంతా ఇస్తేసరి, లేదంటే కేస్‌ బుక్‌ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నాడు కేటుగాడు.

పక్కా ప్లాన్‌తో బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ చేస్తోన్న ఆ అగంతకుడి దెబ్బకు తహశీల్దార్లు బెంబేలెత్తిపోయారు. తమపై రెయిడ్స్‌ చేయొద్దంటూ ప్రాధేయపడ్డారు. కనీసం పది లక్షల రూపాయలు ఇస్తే వదిలేస్తామనడంతో భయపడిన ఎమ్మార్వోలు… ఆ ఫేక్‌ ఏసీబీ డీఎస్పీకి అడిగినంతా సమర్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, నిజాయితీగా ఉన్నోళ్లు ఎదురు తిరగడంతో ఈ బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ బాగోతం బయటికొచ్చింది. అందరికీ చేసినట్లే మాల్యాల తహశీల్దార్‌కు కాల్‌ చేసిన నకిలీ ఏసీబీ డీఎస్పీ. పది లక్షలు ఇవ్వకపోతే, కేసు బుక్‌ చేస్తామంటూ బెదిరించడంతో ఆమె, పోలీసులకు కంప్లైంట్ చేసింది. దర్యాప్తు జరిపిన పోలీసులు, దాన్ని ఫేక్‌ కాల్‌గా తేల్చారు.

అయితే, ఈ ఫేక్‌ ఏసీబీ డీఎస్పీ బెదిరింపులకు భయపడిన కొందరు తహశీల్దార్లు, ఆ కేటుగాడు అగినంతా ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. వాళ్లందరూ బయటికి వస్తేనే ఏ రేంజ్‌లో మోసం జరిగిందో తెలిసే అవకాశముందంటున్నారు పోలీసులు.