- Telugu News Photo Gallery Cinema photos Bollywood star heroine Anushka Sharma wants to say goodbye to movies?
Anushka Sharma: సంచలన నిర్ణయం తీసుకున్న అనుష్క.. షాక్‌లో అభిమానులు
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత కూడా ఆమె హీరోయిన్ గా సినిమాలు చేసింది.
Updated on: May 20, 2022 | 9:45 AM

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత కూడా ఆమె హీరోయిన్ గా సినిమాలు చేసింది.

అనుష్క మాత్రం సినిమాల నుండి మెల్ల మెల్లగా తప్పుకుంటున్నట్లుగా పేర్కొంది.

తన కుటుంబ సభ్యులతో కలిసి అనుష్క గతంలో ఒక నిర్మాణ సంస్థ ను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా పలు సినిమాలను నిర్మించింది.

నిర్మాతగా కూడా అనుష్కకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అలాంటి నిర్మాణంను అనుష్క ఇటీవలే వీడుతున్నట్లుగా ప్రకటించిన విషయం అందరికి తెల్సిందే.

వైవాహిక జీవితాన్ని.. కుటుంబ జీవితాన్ని ఆస్వాదించాలి అంటే ఖచ్చితంగా పోటీ ప్రపంచం నుండి తప్పుకోవాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.

సినిమా ఇండస్ట్రీ అనేది పోటీ ప్రపంచం.. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే కుటుంబ జీవితానికి ఎక్కువ సమయం కేటాయించడంలో విఫలం అవుతున్నాం. అందుకే పోటీ ప్రపంచం నుండి తప్పుకోవాలని భావిస్తున్నట్లుగా పేర్కొంది.




