Jyeshtha Masam: గ్రహ దోషాలు తొలగిపోవాలంటే జ్యేష్ఠ మాసంలో ఈ మూడు పనులు చేయండి..

Jyeshtha Masam: మే 22 నుంచి జ్యేష్ఠ మాసం ప్రారంభం కానుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో మూడవ నెలగా పరిగణించబడుతుంది.

Jyeshtha Masam: గ్రహ దోషాలు తొలగిపోవాలంటే జ్యేష్ఠ మాసంలో ఈ మూడు పనులు చేయండి..
Astro Tips
Follow us
Shiva Prajapati

|

Updated on: May 20, 2022 | 9:48 AM

Jyeshtha Masam: మే 22 నుంచి జ్యేష్ఠ మాసం ప్రారంభం కానుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో మూడవ నెలగా పరిగణించబడుతుంది. ఈ నెలకు మతపరమైన ప్రాముఖ్యత చాలా ఉంది. ఈ మాసం ప్రధానంగా సూర్య భగవానుడు, హనుమంతుని ఆరాధనకు ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. జ్యేష్ఠ మాసంలో.. పవనసుతుడు హనుమంతుడు తన ప్రియమైన శ్రీరాముడిని కలుసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలోనే సూర్యుని వేడి తారాస్థాయికి చేరుతుంది. సూర్యుని జ్యేష్ఠత దృష్ట్యా దీనిని జ్యేష్ఠ మాసం అంటారు . సూర్యుని బలమైన వేడి కారణంగా ఈ మాసంలో నీటి ప్రాముఖ్యత గణనీయంగా పెరుగుతుంది.

అయితే, ఈ జేష్ఠ్య మాసంలో దాన ధర్మాలు చేయడం వలన శ్రీమహా విష్ణువు, లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందనే విశ్వాసం ప్రజల్లో ఉంది. అంతేకాదు.. గ్రహ దోషాలను పోగొట్టడానికి కూడా ఈ మాసం ఉత్తమంగా పరిగణించబడుతుంది. గ్రహ దోషాల వల్ల మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా.. ఈ మాసంలో ఖచ్చితంగా మూడు పనులు చేయడం ద్వారా ఉపశమనం పొందుతారని వేదపండితులు చెబుతున్నారు. జ్యేష్ఠ మాసంలో చేయాల్సిన ఆ మూడు పనులేంటో ఇప్పుడు చూద్దాం..

1. జంతువులు, పక్షులకు నీటిని ఏర్పాటు చేయండి.. జ్యేష్ఠ మాసంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. అలాంటి పరిస్థితిలో నీటి సంరక్షణ, దానం ప్రాముఖ్యత బాగా పెరుగుతుంది. జంతువులు, పక్షులు దాహంతో అల్లాడిపోతుంటాయి. కానీ, ఆ మూగ జీవాలు తమ బాధను బయటకు చెప్పుకోలేవు. అటువంటి పరిస్థితిలో వాటి దాహార్తిని తీర్చేందుకు నీటిని ఏర్పాటు చేస్తే పుణ్యఫలం లభిస్తుంది. ఇంటి బయట గానీ, టెర్రస్ పైన గానీ తాగునీటిని ఏర్పాటు చేయొచ్చు. ఇది గ్రహ దోషాలను తొలగిస్తుంది. అలాగే మీ జీవితంలోని కష్టాలను తొలగిస్తుంది.

2. సూర్య భగవానుడిని ప్రార్థించండి.. గ్రంధాలలో సూర్యుని ఆరాధన ఎల్లప్పుడూ శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా జ్యేష్ఠ మాసం సూర్యారాధనకు చాలా ప్రత్యేకమైనదిగా పేర్కొనడం జరిగింది. ఈ మాసంలో ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, నారాయణుని, లక్ష్మి దేవిని ధ్యానించాలి. అలాగే, స్నానం చేసిన తరువాత సూర్య భగవానుడికి నీటిని అర్పించాలి. రాగి కలశంలో నీళ్లు పోసి, దానికి రోలి, ఎర్రటి పువ్వులు, అక్షతలు వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేస్తే వ్యక్తి గౌరవం పెరుగుతుంది. మంచి ఉద్యోగం పొందుతారు. జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోయి.. సానుకూలతలు ఏర్పడుతాయి.

3. నువ్వులను దానం చేయడం.. జ్యేష్ఠ మాసంలో నువ్వుల దానానికి కూడా విశేష ప్రాధాన్యం ఉంది. ఇది అకాల మరణాన్ని నివారిస్తుందని విశ్వాసం. అంతే కాకుండా తినే నియమాల గురించి కూడా పేర్కొనడం జరిగింది. ఈ మాసంలో ఒక్కపూట భోజనం చేయాలని శాస్త్రాలలో చెప్పబడింది. ఈ మాసంలో బెండకాయ తినడం నిషేధం. శాస్త్రీయ దృక్కోణంలో ఈ ఆహార నియమాలన్నీ వేసవి కాలం చూసి తయారు చేయబడ్డాయి. వేసవిలో ఉదర సంబంధిత సమస్యలు పెరుగుతాయి. అలాగే జేష్ఠ్య మాసంలో వాతావరణాన్ని బట్టి ఒకేసారి ఆహారం తీసుకోవాలనే సలహా కూడా ఇవ్వబడింది.