AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Punjab tour: రచ్చ రాజేసిన ప్రధాని మోడీ పంజాబ్‌ పర్యటన.. అధికార-విపక్షాల మాటల దుమారం!

ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్‌ పర్యటనలో అడుగడుగునా భద్రతా సవాళ్లు ఎదురయ్యాయి. పంజాబ్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. పంజాబ్‌ పోలీస్‌ శాఖ వైఫల్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందులోనూ పాకిస్థాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ప్రధానికి రక్షణ కల్పించ లేకపోవడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

PM Modi Punjab tour: రచ్చ రాజేసిన ప్రధాని మోడీ పంజాబ్‌ పర్యటన..  అధికార-విపక్షాల మాటల దుమారం!
Pm Modi
Balaraju Goud
|

Updated on: Jan 05, 2022 | 8:57 PM

Share

PM Narendra Modi Rally in Punjab: ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్‌ పర్యటనలో అడుగడుగునా భద్రతా సవాళ్లు ఎదురయ్యాయి. పంజాబ్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. పంజాబ్‌ పోలీస్‌ శాఖ వైఫల్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందులోనూ పాకిస్థాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ప్రధానికి రక్షణ కల్పించ లేకపోవడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రధాని మోడీ పంజాబ్‌ టూర్‌ను ఓసారి గమనిస్తే.. భద్రతా వైఫల్యం ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ఉదయం భటిండాలో ల్యాండ్‌ అయ్యారు ప్రధాని. అక్కడి నుంచి హుస్సైనీవాలాలోని అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించాల్సి ఉంది. ఈ స్థూపం వద్దకు ప్రధాని హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉండగా.. అందుకు వాతావరణం సహకరించలేదు. వెదర్‌ క్లియరెన్స్‌ వచ్చే వరకూ.. అంటే 20 నిమిషాల పాటూ ప్రధాని మోడీ అక్కడే వెయిట్‌ చేశారు. క్లియరెన్స్‌ రాకపోవడంతో రోడ్డుమార్గాన వెళ్లేందుకు సిద్ధమయ్యారు మోడీ. చివరి క్షణాన రూట్‌ మారడంతో డీజీపీకి సమాచారం చేరవేశారు అధికారులు. అవసరమైన సెక్యూరిటీ కల్పించేందుకు డీజీపీ సైతం పచ్చజెండా ఊపారు.

ఆ తర్వాతే అసలు సీన్‌ మొదలైంది. సరిగ్గా.. అమరవీరుల స్థూపానికి 30 కిలోమీటర్ల దూరంలో ప్రధాని మోదీ కాన్వాయ్‌ ప్రయాణానికి బ్రేకులు పడ్డాయి. ఫ్లై ఓవర్‌ మీదకు చేరుకోగానే.. అక్కడ ఆందోళనకారులు పెద్ద ఎత్తున దర్శనమిచ్చాయి. ఈ ప్రొటెస్ట్‌తో ప్రధాని కాన్వాయ్‌ ముందుకెళ్లలేని పరిస్థితి దాపురించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో మోదీ తిరుగుపయనమయ్యారు. DGP నుంచి క్లారిటీ తీసుకున్నాకే ముందుకు కదిలిన ప్రధాని కాన్వాయ్‌కు గట్టి ఝలక్‌ తగిలింది. DGP చెప్పిందొకటి.. జరిగింది మరోటి అని అంటున్నాయి కేంద్ర హోంశాఖ వర్గాలు. ఇది ముమ్మాటికీ భద్రతా వైఫల్యమేనని స్పష్టం చేస్తున్నాయి.

ఈ ఘటనపై ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్‌ అయింది. భద్రతాలోపంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముందస్తుగా SSP స్థాయి అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆ తర్వాత భటిండా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు ప్రధాని మోదీ. అటు నుంచి ఢిల్లీకి క్షేమంగా వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పంజాబ్‌ సీఎం చన్నీకి కృతజ్ఞతలు చెప్పానని చెప్పండి అంటూ అధికారులకు సూచించారు. ఎయిర్‌పోర్ట్‌కి ప్రాణాలతో చేరుకోగలిగానని చెప్పారు.

ప్రజల తిరస్కరణను తట్టుకోలేకే కాంగ్రెస్‌ ఇలాంటి ఘటనలకు పాల్పడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. దేశ ప్రజలకు కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. భద్రతా వైఫల్యంపై పూర్తి నివేదిక అందించాలని పంజాబ్ అధికారులను ఆదేశించారు.

మరోవైపు.. ప్రధాని ర్యాలీకి ప్రజలు రాకుండా అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు బీజేపీ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా.

ప్రధాని పర్యటనను రాజకీయం చేయొద్దన్నారు సీఎం చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ. ప్రధాని అంటే తమకు గౌరవం ఉందన్నారు. ప్రధాని ఆకస్మికంగా రోడ్డుమార్గాన ప్రయాణించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్పష్టం చేశారు.

ఇదే విషయమై స్పందించిన.. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ.. రాజకీయ కోణంలో సెక్యూరిటీ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు. కుట్రపూరితంగానే ప్రధాని పంజాబ్‌ పర్యటనలో భద్రతాపరమైన వైఫల్యం తలెత్తింది.. ఇది ముందస్తు ప్రణాళికప్రకారమే జరిగిందని స్మృతీ ఇరానీ ఆరోపించారు.

పంజాబ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని, పంజాబ్‌ రాష్ట్రం సురక్షితంగా ఉండాలన్నా, శాంతి భద్రతలను కాపాడాలన్నా వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ డిమాండ్ చేశారు. రోడ్ల దిగ్బంధంతో ప్రధాని నరేంద్ర మోడీ ఫ్లైఓవర్‌పైనే ఉండిపోవడంపై పంజాబ్‌ సర్కార్‌ను ఆయన తప్పుపట్టారు. ఇది తీవ్రమైన భద్రతా లోపమేనని అన్నారు. ”ప్రధానికి సురక్షితంగా ప్రయాణించడానికి వీలు కల్పించలేకపోతే, అందులోనూ పాకిస్థాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ప్రధానికి రక్షణ కల్పించ లేకుంటే మీరు మీ పదవిలో కూర్చునేందుకు తగరు. వెంటనే పదవి నుంచి తప్పుకోండి” అని ముఖ్యమంత్రి, హోం మంత్రిపై మీడియా సమావేశంలో కెప్టెన్ విరుచుకుపడ్డారు.

అయితే, ప్రధాని మోడీ అలా వెనక్కి వెళ్లడం చాలా బాధాకరమని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ అన్నారు. పంజాబ్‌కు ప్రధాని మోడీ రావాలని, పంజాబ్‌లో ఎలాంటి భద్రతా సమస్య లేదని చన్నీ స్పష్టం చేశారు. బుధవారం నిర్వహించాల్సిన సభకు ఇప్పటికైనా తిరిగి వచ్చి సభ నిర్వహించాలని కోరారు. మన దేశ ప్రధానిని తాము గౌరవిస్తామని చన్నీ పేర్కొన్నారు. ఢిల్లీకి మోడీ పయనమైన అనంతరం ముఖ్యమంత్రి చన్నీ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నిర్వహించిన సభకు ప్రజల ఆదరణ లేనందువల్లే ప్రధాని మోడీ తన సభను రద్దు చేసుకున్నారని, అది బయటికి చెప్పలేక తమపై నిందలు మోపుతున్నారని పంజాబ్ సీఎం చన్నీ ఘాటుగా స్పందించారు.

Read Also….  మంచు దుప్పటి కప్పేసిన కశ్మీరం.. భారీ హిమపాతంతో శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో విమానాల రద్దు.. ఇబ్బందుల్లో ప్రయాణికులు