- Telugu News Photo Gallery Viral photos Flights at Srinagar Airport cancelled, power supply disrupted due to rains and snowfall in Kashmir
మంచు దుప్పటి కప్పేసిన కశ్మీరం.. భారీ హిమపాతంతో శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో విమానాల రద్దు.. ఇబ్బందుల్లో ప్రయాణికులు
కశ్మీర్ అంతటా దట్టమైన మంచు కురుస్తోంది.. భారీ హిమపాతంతో శ్రీనగర్ విమానాశ్రయం రన్‌వే పూర్తిగా మంచుతో పూడుకుపోయింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలను నిలిపివేశారు.
Updated on: Jan 05, 2022 | 8:06 PM

కశ్మీర్ అంతటా దట్టమైన మంచు కురుస్తోంది.. భారీ హిమపాతంతో శ్రీనగర్ విమానాశ్రయం రన్‌వే పూర్తిగా మంచుతో పూడుకుపోయింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో ప్రయాణీకులు, పర్యాటకులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు..

ఎక్కడ చూసినా తెల్లటి దుప్పటిలా కప్పేసిన మంచు.. ఇళ్లు, వాహనాలు, రోడ్లు, చెట్లు, పర్వతాలు ఎక్కడ చూసినా ఇదే వాతావరణం.. అందాల కశ్మీరం మరింత ముగ్ద మనోహరంగా మారిపోయింది.. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి కనిపిస్తోంది..

ఉష్ణోగ్రత్తలు పూర్తిగా మైనస్ డిగ్రీల దిగువకు పడిపోయాయి.. శ్రీనగర్‌లో 0.5 ఉష్ణోగ్రత నమోదు కాగా, గుల్‌మార్గ్‌లో మైనస్ 5 డిగ్రీలు, ద్రాస్‌లో మైనస్ 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది..

జమ్మూ కశ్మీర్‌లో ఎక్కడ చూసినా దట్టమైన మంచు కురుస్తోంది.. చివరకు శ్రీనగర్ ఎయిర్ పోర్టును కూడా మంచు దుప్పటి కప్పేసింది.. కొన్ని అడుగుల మేర పేరుకుపోయిన మంచును తొలగించేందుకుకు చాలా కష్టపడాల్సి వస్తోంది..

ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.. ఎదురుగా ఉన్నవి కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది.. టేకాప్, ల్యాండింగ్ కూడా కష్టం కావడంతో 44 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు..

మంచు కారణంగా విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో చాలా మంది నిలిచిపోయారు..

మరోవైపు వైష్ణోదేవీ ఆలయానికి హెలిక్యాప్టర్ సర్వీసులు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. మరి కొద్ది రోజుల పాటు జమ్మూ కశ్మీర్‌లో ఇదేరకమైన వాతావరణం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు..

3

6





























