AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi on Election Results: ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ మొదటి స్పందన ఇదే.. ఏం చెప్పారంటే..!

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024 మంగళవారం (జూన్ 4) వెల్లడయ్యాయి. కాగా, ఎన్నికల ట్రెండ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)పై ప్రజలు వరుసగా మూడోసారి విశ్వాసం వ్యక్తం చేశారని ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇది చారిత్రాత్మక విజయం అన్నారు.

Modi on Election Results: ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ మొదటి స్పందన ఇదే.. ఏం చెప్పారంటే..!
Narendra Modi
Balaraju Goud
|

Updated on: Jun 04, 2024 | 8:43 PM

Share

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024 మంగళవారం (జూన్ 4) వెల్లడయ్యాయి. కాగా, ఎన్నికల ట్రెండ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)పై ప్రజలు వరుసగా మూడోసారి విశ్వాసం వ్యక్తం చేశారని ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇది చారిత్రాత్మక విజయం అన్నారు.

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు గత దశాబ్దంలో చేసిన మంచి పనిని కొనసాగిస్తామనీ, ఈ అభిమానానికి నా అభివాదం చేస్తున్నానని ఆయన అన్నారు. కష్టపడి పనిచేసిన మా కార్యకర్తలందరికీ నేను కూడా సెల్యూట్ చేస్తున్నాను అని అన్నారు. అసాధారణ ప్రయత్నాలకు మాటలు చెప్పలేనిదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్డీయే ప్రభుత్వం

దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఎన్డీయేకు ఆంధ్రప్రదేశ్ అసాధారణ ఆదేశాన్ని ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులకు ధన్యవాదాలు. ఈ ఘనవిజయం సాధించినందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకత్వానికి అభినందలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతామని, రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తామన్నారు.

దీంతో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, ధన్యవాదాలు ఒడిశా! ఇది సుపరిపాలనకు, ఒడిశా విశిష్ట సంస్కృతికి గొప్ప విజయమన్నారు. ప్రజల కలలను నెరవేర్చేందుకు, ఒడిశాను ప్రగతిపథంలో కొత్త శిఖరాలకు తీసుకెళ్ళేందుకు బీజేపీ ఏ అవకాశాన్ని వదిలిపెట్టదు. కష్టపడి పనిచేసే పార్టీ కార్యకర్తలందరి కృషికి నేను చాలా గర్వపడుతున్నాను అంటూ పేర్కొన్నారు.

ఇదిలావుంటే, లోక్‌సభ ఎన్నికల ట్రెండ్‌లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అదే సమయంలో కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ మూడో స్థానంలో నిలిచింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…