AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Politics: ప్రధాని మోదీ మహారాష్ట్ర పర్యటన.. మంత్రి ఆదిత్య థాక్రేకు చేదు అనుభవం.. సీఎం ఉద్దవ్ ఏమన్నారంటే..

Maharashtra Politics: మహారాష్ట ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి ఆదిత్య థాక్రేకు చేదు అనుభవం ఎదురైంది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భద్రతా సిబ్బంది తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.

Maharashtra Politics: ప్రధాని మోదీ మహారాష్ట్ర పర్యటన.. మంత్రి ఆదిత్య థాక్రేకు చేదు అనుభవం.. సీఎం ఉద్దవ్ ఏమన్నారంటే..
Pm Modi
Ayyappa Mamidi
|

Updated on: Jun 14, 2022 | 9:37 PM

Share

Maharashtra Politics: మహారాష్ట ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి ఆదిత్య థాక్రేకు చేదు అనుభవం ఎదురైంది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భద్రతా సిబ్బంది తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. మంత్రి ఆదిత్య థాక్రేను.. సీఎం ఉద్ధవ్ థాక్రే కారు నుంచి దిగాల్సిందిగా భద్రతా సిబ్బంది సూచించారు. ఈ ఘటనపై సీఎం ఉద్ధవ్ థాక్రే స్పందించారు. ముంబైలో ప్రధాని మోడీని రిసీవ్ చేసుకోవడానికి షెడ్యూల్ చేసిన వీఐపీల జాబితాలో ఆదిత్య థాక్రే పేరు లేదంటూ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రతా సిబ్బంది ఇలా చేసినట్లు తెలుస్తోంది. చివరికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అసంతృప్తి వ్యక్తం చేయటంతో ఆదిత్య థాక్రేను ప్రధాని మోదీని స్వాగతించేందుకు అనుమతించారు. అనేక నెలలుగా బీజేపీ, శివసేనకు మధ్య వివాదాలు జరిగిన తరువాత నేడు మోదీ, ఉద్ధవ్ థాక్రే కలిగి రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ విప్లవకారుల గ్యాలరీని ప్రారంభించారు. రానున్న తరాలకు స్వాతంత్య్ర పోరాట గాథలను అందించడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని ఉద్ధవ్ థాక్రే అన్నారు.

మహారాష్ట్ర డీసీఎం, పూణే జిల్లా గార్డియన్, ఎన్సీపీ నేత మంత్రి అజిత్ పవార్ దేహులో జరిగిన కార్యక్రమంలో ప్రధాని సమక్షంలో మాట్లాడేందుకు అనుమతించలేదు. ఇది మహారాష్ట్రను అవమానించడమేనని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే.. దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడటానికి అనుమతించారు. ఇది మహారాష్ట్రను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులు ప్రధానిని మాట్లాడమని ఆహ్వానించిన తర్వాత.. అజిత్ పవార్ తన ప్రసంగాన్ని అందించవలసిందిగా కోరారు. అయితే.. ప్రధాని ప్రసంగానికి సంబంధించిన ప్రకటన అప్పటికే వెలువడినందున అజిత్ పవార్ సున్నితంగా తిరస్కరించారు.