Water Metro: దేశంలోనే మొట్టమొదటి వాటర్ మెట్రో అందుబాటులోకి.. ఎక్కడంటే
ఇప్పటివరకు మనదేశంలో వంతెనలపై వెళ్లే మెట్రో రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే నీటిలో వెళ్లే మెట్రో గురించి ఎప్పుడైనా విన్నారా. ఆ మెట్రో సేవలే కేరళలో అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ 25న ప్రధాని మోదీ ఈ వాటర్ మెట్రో సేవల్ని ప్రారంభించనున్నారు.
ఇప్పటివరకు మనదేశంలో వంతెనలపై వెళ్లే మెట్రో రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే నీటిలో వెళ్లే మెట్రో గురించి ఎప్పుడైనా విన్నారా. ఆ మెట్రో సేవలే కేరళలో అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ 25న ప్రధాని మోదీ ఈ వాటర్ మెట్రో సేవల్ని ప్రారంభించనున్నారు. దీనివల్ల కొచ్చి లాంటి ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే కొచ్చితో పాటు చుట్టుపక్కల ఉన్న 10 దీవులను కలుపుతూ కేరళ డ్రీమ్ ప్రాజెక్టైన ఈ కొచ్చి వాటర్ మెట్రో ప్రాజెక్టును పూర్తి చేశారు. దాదాపు 78 ఎలక్ట్రిక్ బోట్లు నీటిపై ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి.38 టర్మినల్స్ ఉన్నాయి. 1,136 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును పూర్తిచేశారు.
ఈ విషయంపై కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కూడా ట్విట్టర్‌లో స్పందించారు. ప్రయాణాలకు, పర్యటక రంగానికి మరిన్ని మంచి రోజులు రాబోతున్నాయంటూ పేర్కొన్నారు. అయితే ఈ కొచ్చి వాటర్ మెట్రో ప్రాజెక్ట్ ద్వారా దీవుల్లో నివసించే దాదాపు లక్ష మందికి లబ్ది చేకూరనుంది. ఈ ప్రాజెక్టు అక్కడి ప్రజల జీవనోపాధి కూడా మెరుగుపడనుంది. ఏప్రిల్ 26 న ఈ వాటర్ మెట్రో మొదటగా హైకోర్టు – విపిన్ రూట్లో వెళ్లనుంది. ఏప్రిల్ 27 వ తేదిన విట్టిలా – కక్కనాడ్ వెళ్లనుంది. అయితే వీటి టికెట్ రేట్లు రూ.20, రూ.40 నిర్ణయించారు. రోజుకు 12 గంటల పాటు ఈ బోట్ల సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
The world-class #KochiWaterMetro is setting sail! It is Kerala’s dream project connecting 10 islands in and around Kochi. KWM with 78 electric boats & 38 terminals cost 1,136.83 crores, funded by GoK & KfW. Exciting times are ahead for our transport and tourism sectors! pic.twitter.com/IrSD8hqh9l
— Pinarayi Vijayan (@pinarayivijayan) April 22, 2023
Kerala | On 25th April, PM Modi will dedicate to the nation India’s first Water Metro. Water Metro is a unique urban mass transit system with the same experience and ease of travel as that of the conventional metro system. It is very useful in cities like Kochi. pic.twitter.com/QxxlF04Nww
— ANI (@ANI) April 23, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం..