AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బస్సు ఢీ.. నలుగురు దుర్మరణం.. 22 మందికి..

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా.. 22 మంది గాయాలపాలయ్యారు. బెంగళూరు-పూణే జాతీయ రహదారిపై పూణే సమీపంలోని నర్హె ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున లారీ, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి.

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బస్సు ఢీ.. నలుగురు దుర్మరణం.. 22 మందికి..
Road Accident
Shaik Madar Saheb
|

Updated on: Apr 23, 2023 | 12:00 PM

Share

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా.. 22 మంది గాయాలపాలయ్యారు. బెంగళూరు-పూణే జాతీయ రహదారిపై పూణే సమీపంలోని నర్హె ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున లారీ, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారని.. మరో 22 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిందన్నారు. స్థానికుల సమాచారంతో హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

కాగా.. బస్సులోని ప్రయాణికులు గోరేగావ్ ప్రాంతానికి చెందిన ఒక సంస్థకు చెందినవారని.. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు పూణెకు వెళ్లారని.. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

నర్హే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఎన్‌సిపి నాయకురాలు, ఎంపి సుప్రియా సూలే దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటన గురించి తెలుసుకున్న సుప్రియా సూలే ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు.

అంతకుముందు ఏప్రిల్ 15 న మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లోని ఖోపోలి ప్రాంతంలో బస్సు కాలువలో పడిన ఘటనలో 12 మంది మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు