Gaganyaan: తిప్పరా మీసం.. గగన్ యాన్‌కు సిద్ధం.. 2025లో ప్రయోగం.!

సారే జహా సే అచ్ఛా. 1984 ఏప్రిల్ 3 నుంచి ఇప్పటివరకు ఈ సమాధానమే విన్నాం. నాడు ఎయిర్ ఫోర్స్ పైలెట్ రాకేశ్ శర్మ.. సోవియట్ వ్యోమనౌకలో తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లారు. సెల్యూట్ 7 స్పేస్ స్టేషన్ లో 8 రోజులు ఉన్న సంగతిని మనం మర్చిపోలేం. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీతో రాకేశ్ శర్మ స్పేస్ నుంచే మాట్లాడారు.

Gaganyaan: తిప్పరా మీసం.. గగన్ యాన్‌కు సిద్ధం.. 2025లో ప్రయోగం.!
Gaganyaan
Follow us
Gunneswara Rao

| Edited By: TV9 Telugu

Updated on: May 10, 2024 | 5:41 PM

సారే జహా సే అచ్ఛా. 1984 ఏప్రిల్ 3 నుంచి ఇప్పటివరకు ఈ సమాధానమే విన్నాం. నాడు ఎయిర్ ఫోర్స్ పైలెట్ రాకేశ్ శర్మ.. సోవియట్ వ్యోమనౌకలో తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లారు. సెల్యూట్ 7 స్పేస్ స్టేషన్‌లో 8 రోజులు ఉన్న సంగతిని మనం మర్చిపోలేం. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీతో రాకేశ్ శర్మ స్పేస్ నుంచే మాట్లాడారు. ఆ సమయంలో ఆమె అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా? అంతరిక్షం నుంచి మన దేశం ఎలా కనిపించింది అని అడిగారు. దానికి ఆయన చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? సారే జహా సే అచ్ఛా.. అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే మన గుండెల్లో మారుమోగుతోంది. ఇది జరిగిన 40 ఏళ్ల తరువాత మళ్లీ ఆ కల నేరవేరబోతోంది.

40 ఏళ్ల కిందట మన మనిషి భూమిని దాటి స్పేస్‌లోకి వెళ్లినా ఆ ప్రయాణం సోవియట్ గడ్డ మీద నుంచి మొదలైంది. కానీ మన గడ్డపై నుంచి ఎవరినీ పంపించలేకపోయామన్న ఆవేదన ఇప్పుడు తీరిపోనుంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు వ్యోమగాములను దీని కోసం సిద్ధం అవుతున్నారు. వాళ్లు ఎవరెవరో తెలుసా? మన ఎయిర్ ఫోర్స్‌కు చెందిన నలుగురు పైలెట్లు. గ్రూప్ కెప్టెన్స్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్.. వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా. 140 కోట్ల మంది భారతీయుల ఆశలను, ఆకాంక్షలను త్వరలో అంతరిక్షంలోకి తీసుకెళ్లే మన ప్రతినిధులు వీళ్లే. ఈ నలుగురు వ్యోమగాములు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి వెళ్తారు. ఈ మాట వింటేనే గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. చంద్రయాన్ అయినా, గగన్ యాన్ అయినా.. మహిళా శాస్త్రవేత్తల పాత్రను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. ఈ మిషన్‌లో వారిదీ కీలక పాత్రే.

వీరిలో ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ది కేరళలోని పాలక్క‌డ్‌లో నేన్‌మెరా గ్రామం. ఆయన తల్లిదండ్రుల పేర్లు.. బాల‌కృష్ణ‌న్‌, ప్ర‌మీల‌. పాలక్కాడ్‌లోని NSS ఇంజనీరింగ్ కాలేజ్‌లో చదివారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి డిగ్రీ తీసుకున్న తరువాత.. 1999లో కమీషన్డ్ ఆఫీసర్‌గా ఎయిర్ ఫోర్స్‌లో జాయిన్ అయ్యారు. సుఖోయ్ యుద్ధ విమానం పైలెట్ అయిన ప్రశాంత్.. ఈ అంతరిక్ష యాత్ర కోసం రష్యాలో ట్రైనింగ్ తీసుకున్నారు. రష్యా ట్రైనింగ్ తరువాత బెంగళూరులోనూ కొన్నాళ్లు ప్రిపేర్ అయ్యారు. ప్రశాంత్.. హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో స్వార్ ఆఫ్ ఆనర్ అందుకున్నారన్న సంగతిని మర్చిపోకూడదు. అలాగే అమెరికాలో ఫస్ట్ క్లాస్ హానర్స్‌ను ఎయిర్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలో చదివారు.

గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్.. మిగిలిన ముగ్గురు వ్యోమగాములతో కలిసి రష్యాలో 13 నెలల పాటు కఠినమైన శిక్షణను తీసుకున్నారు. ఇక వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా.. మాస్కోలోని యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో అంతరిక్షానికి సంబంధించి వివిధ అంశాల్లో ట్రైనింగ్ తీసుకున్నారు. అజిత్ కృష్ణన్ కూడా చాలా పరీక్షలు ఎదుర్కొన్న తరువాతే ఈ మిషన్ కి ఎంపికయ్యారు. శారీరకంగా దృఢత్వం ఉన్నవారిని ఈ మిషన్‌కు సెలక్ట్ చేశారు. ఎందుకంటే అంతరిక్షయానం చేయాలంటే ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలి. ఎలాంటి అనారోగ్య సమస్యను అయినా ఫేస్ చేసే స్థాయిలో ఉండాలి. అందుకే ఈ నలుగురిని చాలా జాగ్రత్తగా సెలక్ట్ చేశారు. టెక్నికల్‌గా కూడా అంతే స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చారు.