Snake Bite: వీడేం మనిషిరా బాబు.! అమ్మమ్మకు పాముతో కాటు వేయించిన మనవడు.!
బీమా పేరుతో అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఉదంతాలు ఆగడం లేదు. రోజుకో ఏదో ఒకచోట వెలుగు చూస్తునే ఉన్నాయి. డబ్బుల కోసం నా అనుకున్న వారినే అంతమొందిస్తున్న కథనాలు విస్తుగొల్పుతున్నాయి. బీమా సొమ్ము కోసం కక్కుర్తి పడి అమ్మమ్మను స్వయానా మనవడే హత్య చేసిన ఘటన చత్తీస్‌గఢ్‌లో వెలుగు చూసింది. ఏదో తేడా కొడుతోందన్న పోలీసుల అనుమానం నిజమైంది.
బీమా పేరుతో అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఉదంతాలు ఆగడం లేదు. రోజుకో ఏదో ఒకచోట వెలుగు చూస్తునే ఉన్నాయి. డబ్బుల కోసం నా అనుకున్న వారినే అంతమొందిస్తున్న కథనాలు విస్తుగొల్పుతున్నాయి. బీమా సొమ్ము కోసం కక్కుర్తి పడి అమ్మమ్మను స్వయానా మనవడే హత్య చేసిన ఘటన చత్తీస్‌గఢ్‌లో వెలుగు చూసింది. ఏదో తేడా కొడుతోందన్న పోలీసుల అనుమానం నిజమైంది. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో కోటీశ్వరుడు కావాలనే దురాశతో ఓ యువకుడు తన అమ్మమ్మకు బీమా చేయించి, తర్వాత పాము కాటు వేయించి చంపేశాడు. బాందే పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాణి పఠారియా అనే మహిళ పేరిట ఆమె మనవడు ఆకాశ్ కోటి రూపాయల బీమా పాలసీ చేయించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఓ వ్యక్తికి 30 వేల రూపాయలు సుపారీ ఇచ్చి.. వృద్ధురాలికి పాము కాటు వేయించాడు. అనంతరం ఆమె చనిపోయింది. పాము కాటు కారణంగానే మరణం సంభవించిందని నిందితుడు అందరినీ నమ్మించాడు. కోటి రూపాయల బీమా సొమ్ము అందుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులకు ఆకాశ్ ప్రవర్తనపై అనుమానం కలిగింది. ఈ క్రమంలో అతణ్ని పదేపదే ప్రశ్నించగా అసలు సంగతి బయటపడింది. దీంతో ఆకాశ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని దగ్గర నుంచి 10 లక్షల క్యాష్, రాణి పఠారియా నగలను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

