Odisha: భారీ శబ్దంతో డీజే పాటలు.. గుండెపోటుతో 50 ఏళ్ల వ్యక్తి మృతి.!

ఊరేగింపు సందర్భంగా పెద్ద శబ్దంతో పాటలు పెట్టడంతో ఓ మధ్య వయస్కుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఒడిశాలో తాజాగా జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, రూర్కెలా నగరంలో సరస్వతీ మాత విగ్రహం నిమజ్జనం కోసం ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమానికి నిర్వాహకులు డీజే బృందాన్ని పిలిచారు. ఊరేగింపులో డీజే పెద్ద శబ్దంతో పాటలు పెట్టాడు.

Odisha: భారీ శబ్దంతో డీజే పాటలు.. గుండెపోటుతో 50 ఏళ్ల వ్యక్తి మృతి.!

|

Updated on: Feb 28, 2024 | 9:53 AM

ఊరేగింపు సందర్భంగా పెద్ద శబ్దంతో పాటలు పెట్టడంతో ఓ మధ్య వయస్కుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఒడిశాలో తాజాగా జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, రూర్కెలా నగరంలో సరస్వతీ మాత విగ్రహం నిమజ్జనం కోసం ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమానికి నిర్వాహకులు డీజే బృందాన్ని పిలిచారు. ఊరేగింపులో డీజే పెద్ద శబ్దంతో పాటలు పెట్టాడు. ఈ క్రమంలో అక్కడే ఓ టీస్టాల్ నిర్వహిస్తున్న ప్రేమ్‌నాథ్ బారాభాయ్‌కు గుండెపోటు వచ్చింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అతడిని రూర్కెలా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. దీంతో, స్థానికులు రఘునాథ్‌పలీ పోలీస్ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. డీజేను అరెస్టు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. భారీ శబ్దాల వల్ల హార్ట్‌ ఎటాక్‌ వస్తుందా?. చెవి నుంచి వెళ్లే శబ్ద తరంగాలు గుండెను ప్రభావితం చేస్తాయా? అంటే ఔననే అంటున్నారు వైద్యులు. భారీ శబ్దాలు మనిషిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ఏ సంగీతాన్ని అయినా ఓ నిర్దిష్ట పరిమితి దాటి ఫ్రీక్వెన్సీ పెంచితే హృదయంపై హానికరమైన ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలలో తేలింది. భారీ శబ్దానికి గురైనప్పుడూ హృదయ స్పందన వేగం ఒక్కసారిగా పెరగడం, భయం, ఆందోళన చెందడాన్ని గుర్తించారు. చాలామంది, జాగింగ్‌ చేసేటప్పుడూ వ్యాయామాలు చేసేటప్పుడూ మ్యూజిక్‌ పెట్టుకుని చేస్తుంటారు ఇది అంత మంచి పద్ధతి కాదనే అంటున్నారు. ఓ మోస్తరుగా మనిషి వినగలిగేంత పరిమితి సౌండ్‌తోనే సంగీతం వింటే ఎటువంటి ‍ప్రమాదం ఉండదని చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us