ఉజ్జయినిలో 85 అడుగుల ఎత్తైన టవర్‌పై వేద గడియారం

ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రూపొందింది. వేద గడియారం కోసం ఉజ్జయినిలోని జివాజీ అబ్జర్వేటరీ సమీపంలో 85 అడుగుల ఎత్తైన టవర్‌ను నిర్మించారు. ఉజ్జయినిలో క్రేన్ సాయంతో దాదాపు 80 అడుగుల ఎత్తులో వాచ్ టవర్ పై దీనిని అమర్చారు. దీనిని మార్చి ఒకటిన ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సంయుక్తంగా ప్రారంభించనున్నారు.

ఉజ్జయినిలో 85 అడుగుల ఎత్తైన టవర్‌పై వేద గడియారం

|

Updated on: Feb 27, 2024 | 8:50 PM

ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రూపొందింది. వేద గడియారం కోసం ఉజ్జయినిలోని జివాజీ అబ్జర్వేటరీ సమీపంలో 85 అడుగుల ఎత్తైన టవర్‌ను నిర్మించారు. ఉజ్జయినిలో క్రేన్ సాయంతో దాదాపు 80 అడుగుల ఎత్తులో వాచ్ టవర్ పై దీనిని అమర్చారు. దీనిని మార్చి ఒకటిన ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సంయుక్తంగా ప్రారంభించనున్నారు. వేద గడియారానికి సంబంధించిన ఇన్‌స్టలేషన్, టెస్టింగ్ వర్క్ పూర్తయింది. భారత ప్రామాణిక సమయాన్ని ఈ వేద గడియారంలో చూడవచ్చు. ఈ గడియారంలో ఒక గంట అంటే 48 నిమిషాలు. ఈ గడియారం వేద సమయంతో పాటు వివిధ ముహూర్తాలను కూడా చూపిస్తుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ వాచ్ కానుంది. ఇది భారతీయ ప్రామాణిక సమయం ఐఎస్‌టీతో పాటు గ్రీన్‌విచ్ మీన్ టైమ్ జీఎంటీ మాత్రమే కాకుండా పంచాంగం ఇంకా ముహూర్తాల గురించిన సమాచారాన్ని అందిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయాలే కాకుండా సూర్య , చంద్ర గ్రహణాల గురించి కూడా తెలియజేస్తుంది. వేద క్లాక్ రీడింగ్‌ కోసం మొబైల్ యాప్ రూపొందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌, టెలివిజన్ తదితర పరికరాలలో వినియోగించే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తి మాటలు నమ్మి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు

ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు లేని ఊళ్లో అంబానీ కుమారుడి ప్రీ వెడ్డింగ్‌ వేడుక.. మరి అతిథుల పరిస్థితేంటో

ఢిల్లీ మెట్రోలో గోల్డెన్‌ లైన్‌.. 15 స్టేషన్లు, 24 కి.మీ. ప్రయాణం

రైల్వే ట్రాక్‌పై ట్రక్ బోల్తా.. ఘోర ప్రమాదాన్ని తప్పించిన వృద్ధ దంపతులు

Jayalalitha: జయలలిత నగలు వేలం !! వచ్చిన డబ్బుతో ??

Follow us