డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తి మాటలు నమ్మి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు

డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తి మాటలు నమ్మి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు

Phani CH

|

Updated on: Feb 27, 2024 | 8:49 PM

అమెరికాలో విడాకులు తీసుకున్న భారత సంతతి అమెరికన్ మహిళకు డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తి తియ్యటి మాటలతో వల వేశాడు.. ఇంకా ఎన్నాళ్లు కష్టపడతావు, నాలా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టు ఊహకు అందని లాభాలు పొందొచ్చని ఊరించాడు. కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టిన మహిళను నమ్మించేందుకు భారీ మొత్తంలో లాభాలు చూపించాడు. ఆ సొమ్మును బ్యాంకు ఖాతాలోకి మార్చుకునేలా చేసి విశ్వాసం కలిగించాడు.

అమెరికాలో విడాకులు తీసుకున్న భారత సంతతి అమెరికన్ మహిళకు డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తి తియ్యటి మాటలతో వల వేశాడు.. ఇంకా ఎన్నాళ్లు కష్టపడతావు, నాలా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టు ఊహకు అందని లాభాలు పొందొచ్చని ఊరించాడు. కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టిన మహిళను నమ్మించేందుకు భారీ మొత్తంలో లాభాలు చూపించాడు. ఆ సొమ్మును బ్యాంకు ఖాతాలోకి మార్చుకునేలా చేసి విశ్వాసం కలిగించాడు. దీంతో పూర్తిగా నమ్మిన బాధితురాలు.. తను జీవితాంతం కష్టపడిన సొమ్ముతో పాటు అందినకాడల్లా అప్పు చేసి 4.5 లక్షల డాలర్లు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడిగా పెట్టింది. ఆన్ లైన్ లో భారీ మొత్తంలో లాభాలు వచ్చినట్లు చూపిస్తున్నా.. ఆ సొమ్మును బ్యాంకు ఖాతాలోకి మళ్లించుకునేందుకు వీలు లేకుండా ఆపేయడంతో జరిగిన మోసం బయటపడింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పిగ్ బుచరింగ్ గా వ్యవహరించే ఈ తరహా కేసులు అమెరికాలో ఇటీవల బాగా పెరుగుతున్నాయని పోలీసులు చెప్పారు. భారత సంతతికి చెందిన శ్రేయ దత్తా ఫిలడెల్ఫియాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. కొంతకాలం కిందట భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తి ఆమెను ఆకర్షించాడు. నెలల తరబడి ఛాటింగ్ చేస్తూ బాగా నమ్మించాడు. తొందర్లోనే వారి పరిచయం వాట్సాప్ లో ఛాటింగ్ కు దారితీసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు లేని ఊళ్లో అంబానీ కుమారుడి ప్రీ వెడ్డింగ్‌ వేడుక.. మరి అతిథుల పరిస్థితేంటో

ఢిల్లీ మెట్రోలో గోల్డెన్‌ లైన్‌.. 15 స్టేషన్లు, 24 కి.మీ. ప్రయాణం

రైల్వే ట్రాక్‌పై ట్రక్ బోల్తా.. ఘోర ప్రమాదాన్ని తప్పించిన వృద్ధ దంపతులు

Jayalalitha: జయలలిత నగలు వేలం !! వచ్చిన డబ్బుతో ??

మొబైల్‌ సేవల్లో అంతరాయం.. ఒక్కో కస్టమర్‌కు 5 డాలర్ల పరిహారం