AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: మీరు పీఎం కిసాన్‌ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకున్నారా…? డబ్బులు రావడం లేదా..? అయితే ఇలా చేయండి

PM Kisan Samman Nidhi Scheme: కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతోంది. వీటిల్లో రైతుల కోసం ఓ ప్రత్యేకమైన పథకాన్ని అమలు చేస్తోంది. అదే ప్రధాన మంత్రి కిసాన్‌...

PM Kisan: మీరు పీఎం కిసాన్‌ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకున్నారా...? డబ్బులు రావడం లేదా..? అయితే ఇలా చేయండి
Pm Kisan
Subhash Goud
|

Updated on: Apr 22, 2021 | 7:33 PM

Share

PM Kisan Samman Nidhi Scheme: కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతోంది. వీటిల్లో రైతుల కోసం ఓ ప్రత్యేకమైన పథకాన్ని అమలు చేస్తోంది. అదే ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి స్కీమ్‌. రైతులకు నేరుగా లబ్ది చేకూర్చే పథకం ఇది. ఇందులో చేరిన వారికి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు చేరుతాయి. రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. అర్హులైన రైతులకు ఈ స్కీమ్‌ కింద ప్రతీ యేటా రూ.6 వేలు లభిస్తాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో వస్తాయి. అంటే రూ.2 వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఇప్పటికే చాలా మంది రైతులు ఈ పథకంలో చేరారు. మోదీ సర్కార్‌ ఇస్తున్న రెండు వేల రూపాయలు పొందుతున్నారు. అయితే కొంత మంది ఈ స్కీమ్‌లో చేరినా కూడా డబ్బులు కూడా డబ్బులు రాకపోవచ్చు. ఇలాంటి వారి జాబితాలో మీరు కూడా ఉన్నట్లయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. ఈ స్కీమ్‌లో చేరిన సమయంలో కొన్ని పొరపాట్లు జరడం వల్ల కొందరికి డబ్బు రాలేదని తేలింది. వాటిని సరి చేసుకుంటే యథావిధిగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి.

రిజిస్ట్రేషన్‌ ఫామ్‌లో తప్పులు దొర్లడం కారణంగా మీకు డబ్బులు రాకపోవచ్చు. అయితే మీరు ఆన్‌లైన్‌లోనే ఈ తప్పులను సరి చేసుకోవచ్చు. ఇందు కోసం మీరు పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. దీని కోసం మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఫార్మర్స్ కార్నర్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి సెల్ఫ్ రిజిస్టర్డ్ ఫార్మర్ ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ ఆధార్‌ నెంబర్‌, క్యాప్చార్‌ ఎంటర్‌ చేయాలి. సెర్చ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. మీ రిజిస్ట్రేషన్‌ ఫామ్‌ కనిపిస్తుంది. అక్కడ ఏవి తప్పులు ఉన్నాయో గమనించాలి. వాటిని సరి చేసి సబ్మిట్‌ చేయాలి. అయితే డబ్బులు ఖాతాల్లో జమ కాని రైతులు మీ సేవా కేంద్రాలకు వెళ్లి కూడా సరి చేసుకోవచ్చు.

Flipkart Delivery : ఫ్లిప్‌కార్ట్‌ కీలక నిర్ణయం… ఆర్డర్‌ చేసిన గంటన్నరలో ప్రొడక్ట్‌ డెలివరీ.. ప్రస్తుతం ఏయే నగరాల్లో అంటే..!

మీకు ఎస్‌బీఐలో రుణాలు ఇప్పిస్తామని ఫోన్‌లు వస్తున్నాయా..? అయితే తస్మాత్‌ జాగ్రత్త…వెలుగులోకి వస్తున్న మోసాలు

LIC: ప్రీమియం వసూళ్లలో ఎల్‌ఐసీ రికార్డు… కొత్త బిజినెస్‌ ప్రీమియం ఆదాయం రూ.1.84 లక్షల కోట్లు