AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Garib Kalyan Anna Yojana: మీకు ఉచిత రేషన్ అందడం లేదా?.. అయితే ఇలా చేయండి..

PM Garib Kalyan Anna Yojana: ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన కింద దేశ వ్యాప్తంగా లక్షల కుటుంబాలకు ఉచిత రేషన్...

PM Garib Kalyan Anna Yojana: మీకు ఉచిత రేషన్ అందడం లేదా?.. అయితే ఇలా చేయండి..
Ration Card
Shiva Prajapati
|

Updated on: Aug 22, 2021 | 8:44 AM

Share

PM Garib Kalyan Anna Yojana: ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన కింద దేశ వ్యాప్తంగా లక్షల కుటుంబాలకు ఉచిత రేషన్ అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కోవిడ్ సంక్షోభం కారణంగా తలెత్తే ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) పరిధిలోని 80 కోట్ల మంది లబ్ధిదారులకు ఉపశమనం కలిగించేందుకు గతేడాది(మార్చి 2020) ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని నవంబర్ వరకు పొడిగించారు. అయితే, తమకు రేషన్ ఉచితంగా ఇవ్వడం లేదని, ప్రభుత్వం చెప్పినంత రేషన్ సరుకులు అందించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వ్యవస్థ ద్వారా రేషన్ అందని లబ్ధిదారులు ఇంట్లో ఉండే ఫిర్యాదు చేయొచ్చు.

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన మే, జూన్ నెలల్లో అమలు చేశారు. ఆ తరువాత నాలుగో దశలో దీనిని నవంబర్ 2021 వరకు పొడిగించారు. అన్నా యోజన కింద లబ్ధిదారులకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లభించే చౌక రేషన్‌తో పాటు ప్రతీ వ్యక్తికి నెలకు ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తారు.

సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.. ఇప్పుడు కాలం మారింది. సోషల్ మీడియా ప్రజలకు బలమైన ఆయుధంగా మారింది. ఒకవేళ మీకు రేషన్ అందకపోతే, దానికి సంబంధించి ఏవైనా ఇతర సమస్యలను ఎదుర్కొంటుంటే మీరు నేరుగా కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే.. మీరు చేసే ఆ ట్వీట్‌లో మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ట్యాగ్ చేయవచ్చు. దీంతోపాటు ఫిర్యాదుదారుడు పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (https://pgportal.gov.in/) వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కూడా రేషన్‌కు సంబంధించి ఫిర్యాదు చేయొచ్చు.

ఆఫ్‌లైన్‌లో ఫిర్యాదు.. మీకు ఉచిత రేషన్ అందకపోతే, ముందుగా దాని గురించి మీ డీలర్‌ని అడగండి. వారి నుంచి వచ్చే సమాధానం ఆధారంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. ఒకవేళ మీ ఆన్‌లైన్ ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోతే.. ఆఫ్‌లైన్‌ ద్వారా కూడా కంప్లైంట్ ఇవ్వొచ్చు. ఇందుకోసం మీరు జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.

రేషన్ కార్డు దారులకు రూ. 2 కేజీల గోధుమలు, రూ .3 కేజీల బియ్యంతో పాటుగా, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి 5 కిలోల గోధుమలు, బియ్యం ఇస్తోంది.

Also read:

Corona Vaccine: మహిళలు టీకా తీసుకుంటే గర్భధారణకు ఇబ్బంది కలుగుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

చాణక్య నీతి: కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఈ 2 తప్పనిసరి.. ఆచార్య చాణక్య చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం..

Raksha Bandhan 2021: రక్షాబంధన్ రోజున మీ సోదరుల రాశి ప్రకారం ఈ రంగు రాఖీ కట్టండి.. పూర్తి వివరాలు మీకోసం..