శోభనం రోజు భర్తను చూసి బిత్తరపోయిన భార్య..! కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షం.. ఏం జరిగిందంటే..

Wife Complains Husband: ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్‌లో విచిత్ర కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక నవ వధువు హనీమూన్ రోజున తన భర్తపై

శోభనం రోజు భర్తను చూసి బిత్తరపోయిన భార్య..! కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షం.. ఏం జరిగిందంటే..
Marriage
Follow us
uppula Raju

| Edited By: Phani CH

Updated on: Aug 22, 2021 | 9:24 AM

Wife Complains Husband: ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్‌లో విచిత్ర కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక నవ వధువు హనీమూన్ రోజున తన భర్తపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఆమె వయసులో తనకంటే పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ విషయం ఆమెకు అప్పుడే తెలిసిందట. పెళ్లికి ముందు ఆ అమ్మాయికి ఒక యువకుడి ఫొటో చూపించారు. దీంతో ఆ యువతి పెళ్లికి అంగీకరించింది. పెళ్లి తర్వాత వధువు తన భర్త ముఖాన్ని చూసినప్పుడు షాక్ అయింది. అతడు ఫొటోలో ఉన్న వ్యక్తి కాదు. అతడికి బదులుగా అప్పటికే వివాహం చేసుకొని పిల్లలు ఉన్న వ్యక్తి దర్శనమిచ్చాడు. దీంతో వధువు మోసపోయానని గ్రహించి అక్కడి నుంచి పారిపోయింది. అత్తవారింటికి వెళ్లడానికి నిరాకరించింది.

సమాచారం ప్రకారం.. ఆ యువతి తన భర్త ఇంటిని వదిలి ప్రేమికుడితో కలిసి జీవించడం గురించి ఆలోచిస్తుంది. దీని గురించి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నగరంలోని ఒక వార్డులో నివసిస్తున్న ఆ అమ్మాయి పొరుగున ఉన్న యువకుడితో కొత్వాలి చేరుకుంది. బరేలీ జిల్లాలోని సెంథల్ గ్రామానికి చెందిన ఒక మధ్య వయస్కుడితో తనకు ఏడాది క్రితం వివాహం జరిగిందని పోలీసులకు చెప్పింది. పెళ్లికి ఒప్పుకోవడానికి ఒక యువకుడి ఫోటో చూపించినట్లు తెలిపింది. తర్వాత తెలిసింది ఏంటంటే అతడికి ఇది వరకే వివాహమైందని, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని పోలీసులకు వివరించింది. పెద్ద వయస్కుడితో పెళ్లయిన తర్వాత ఆ అమ్మాయికి నిజం తెలిసినప్పుడు ఆమె చాలా తెలివిగా ఆలోచించింది. తన ప్రేమికుడి వద్దకు వెళ్లింది. తనకు జరిగిన అన్యాయం గురించి వివరించి పెళ్లి చేసుకోమని కోరింది. అతడు ఒప్పుకోవడంతో ఇద్దరు కలిసి కుటుంబ సభ్యులు, బంధువులను ఒప్పించే పనిలో పడ్డారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కచ్చితంగా పెళ్లిచేసుకోవాలని నిశ్చయించుకున్నారు.

Kalyan Singh: వివాదాలతో సహవాసం అతడి జీవితం.. వాజ్‌పెయ్‌తో వైరం.. పార్టీ నుంచి బహిష్కరణలు..

PM Narendra Modi: కళ్యాణ్‌ సింగ్‌ మృతిపై సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్రమోడీ.. మాటల్లో చెప్పలేని బాధ ఉందంటూ ట్వీట్‌..

Viral Photos: అందమైన సరస్సుల సొగసు వర్ణించతరమా..! మీరు ఓ లుక్కేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!