PM Narendra Modi: కళ్యాణ్‌ సింగ్‌ మృతిపై సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్రమోడీ.. మాటల్లో చెప్పలేని బాధ ఉందంటూ ట్వీట్‌..

PM Narendra Modi: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజస్థాన్ మాజీ గవర్నర్ కళ్యాణ్ సింగ్ దీర్ఘకాలిక అనారోగ్యంతో శనివారం సాయంత్రం కన్నుమూశారు.

PM Narendra Modi: కళ్యాణ్‌ సింగ్‌ మృతిపై సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్రమోడీ.. మాటల్లో చెప్పలేని బాధ ఉందంటూ ట్వీట్‌..
Kalyan Singh With Narendra Modi
Follow us

|

Updated on: Aug 22, 2021 | 12:03 AM

PM Narendra Modi: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజస్థాన్ మాజీ గవర్నర్ కళ్యాణ్ సింగ్ దీర్ఘకాలిక అనారోగ్యంతో శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. కళ్యాణ్‌ సింగ్‌ మరణవార్త విన్న వెంటనే రాజకీయ ప్రపంచం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. భారత ప్రధాని నరేంద్రమోదీ ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. మాటల్లో చెప్పలేని బాధను వర్ణిస్తూ ట్వీట్‌ చేశారు. అతని కుమారుడు రాజ్‌వీర్ సింగ్‌తో మాట్లాడారు. కళ్యాణ్ సింగ్ జీ తెలివైన రాజకీయవేత్త, అనుభవజ్ఞుడైన నిర్వాహకుడు, అట్టడుగు వర్గాల నాయకుడని కొనియాడారు.

ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో ఆయన చెరగని ముద్రవేశాడని అన్నారు. భారతదేశ సాంస్కృతిక అభ్యున్నతికి కళ్యాణ్ సింగ్ చేసిన కృషి అమోఘం అన్నారు. రాబోయే తరాలు అతడికి రుణపడి ఉంటాయని పేర్కొన్నారు. సమాజంలోని అణగారిన వర్గాలకు చెందిన కోట్లాది మందికి కళ్యాణ్ సింగ్ జీ స్వరం ఇచ్చారని మోదీ అన్నారు. రైతులు, యువత, మహిళల సాధికారత కోసం ఆయన అనేక పోరాటాలు చేశాడని గుర్తు చేశారు. కళ్యాణ్ సింగ్‌ మృతిపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాధ్‌ కూడా స్పందించారు. రాష్ట్రంలో 3 రోజులను సంతాప దినాలుగా ప్రకటించారు. ఆగష్టు 23 సాయంత్రం నరోరాలోని గంగా తీరంలో కల్యాణ్ సింగ్ అంత్యక్రియలు జరుగుతాయి. ఆ రోజు రాష్ట్రంలో ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించారు.

శనివారం రాత్రి సంజయ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGI) విడుదల చేసిన ఒక ప్రకటనలో సింగ్ చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారని, అతని అవయవాలు క్రమంగా పనిచేయడం మానేశాయని తెలిపారు. ఈ కారణంగా అతడు శనివారం తుది శ్వాస విడిచాడని చెప్పారు. కల్యాణ్ సింగ్ 1932 జనవరి 5 న అలీఘర్ జిల్లాలోని అత్రౌలిలో జన్మించారు. సింగ్ 2002 వరకు మొత్తం 9 సార్లు అత్రౌలి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అయ్యారు.1967లో మొదటిసారి ఓడిపోయారు. ప్రస్తుతం అతని కుటుంబానికి చెందిన సందీప్ సింగ్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

Kalyan Singh: వివాదాలతో సహవాసం అతడి జీవితం.. వాజ్‌పెయ్‌తో వైరం.. పార్టీ నుంచి బహిష్కరణలు..

Kalyan Singh: అయోధ్య రామమందిర ఉద్యమంలో అతడిది కీలక పాత్ర.. బాబ్రీ మసీద్‌ ఘటన కారణంగా సీఎం పదవికి రాజీనామా

ఆఫ్ఘన్ నుంచి పారిపోయేందుకు వేలాది మంది యత్నం.. గుంపులను చెదరగొట్టేందుకు అమెరికన్ దళాల బాష్పవాయు ప్రయోగం