ఆఫ్ఘన్ నుంచి పారిపోయేందుకు వేలాది మంది యత్నం.. గుంపులను చెదరగొట్టేందుకు అమెరికన్ దళాల బాష్పవాయు ప్రయోగం

తాలిబన్ల హింసతో అట్టుడుకుతున్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరు బయటపదలచినా వారిని తీసుకువెళ్తామంటూ అమెరికా ప్రకటించినట్టు వదంతులు తలెత్తడంతో శుక్రవారం సాయంత్రం కాబూల్ విమానాశ్రయం వద్ద ఆఫ్ఘన్లు, ప్రజలు పోటెత్తారు.

ఆఫ్ఘన్ నుంచి పారిపోయేందుకు వేలాది మంది యత్నం.. గుంపులను చెదరగొట్టేందుకు అమెరికన్ దళాల  బాష్పవాయు ప్రయోగం
Shah Mahmood
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Aug 21, 2021 | 10:30 PM

తాలిబన్ల హింసతో అట్టుడుకుతున్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరు బయటపదలచినా వారిని తీసుకువెళ్తామంటూ అమెరికా ప్రకటించినట్టు వదంతులు తలెత్తడంతో శుక్రవారం సాయంత్రం కాబూల్ విమానాశ్రయం వద్ద ఆఫ్ఘన్లు, ప్రజలు పోటెత్తారు. వేలాది జనంతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. అయితే ఈ గుంపులను చెదరగొట్టేందుకు అమెరికన్ దళాలు బాష్పవాయువు ప్రయోగించాయి. ఆఫ్ఘన్ ప్రజలకు, వీరికి మధ్య ఓ ఇనుప కంచె అడ్డుగా ఉన్నప్పటికీ .. గుంపులు దాన్ని దాటి వెళ్లేందుకు యత్నించడంతో తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడింది. భారీ సంఖ్యలో ఉన్న వీరిని అదుపు చేయడానికి అమెరికా దళాలతో బాటు బ్రిటన్ సైనికులు కూడా తీవ్రంగా యత్నించారు. కాగా ఈ సైన్యం నుంచి తమను రక్షించి ఆదుకోవాలంటూ అనేకమంది పురుషులు, మహిళలు విలపిస్తున్న దృశ్యాలు కనిపించాయి. కంచెతో కూడిన ఎత్తయిన గోడను దాటి అవతలివైపు చేరేందుకు అనేకమంది యత్నిస్తున్న దృశ్యాలను అమెరికన్ రిపోర్టర్లు, లోకల్ మ]మీడియా కూడా వీడియోలుగా రిలీజ్ చేసింది.

ఇలా ఉండగా కాబూల్ విమానాశ్రయం నుంచి కొన్ని విమానాలు ఖాళీగా వెళ్తుండగా.. మరికొన్ని విమానాలు స్వల్ప సంఖ్యలో విదేశియులను తీసుకువెళ్తూ కనిపించాయి. ఆఫ్ఘానిస్తాన్ లోని కొన్ని నగరాల్లో మహిళలు తాలిబాన్లకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఆఫ్ఘన్ జాతీయ పతాకాలను పట్టుకున్న వీరు.. విజయమో..వీర స్వర్గమో అన్నట్టు నిరసన ప్రదర్శనలకు దిగినట్టు వార్తలందుతున్నాయి. ఆఫ్ఘన్ రెసిస్టెన్స్ ఫోర్స్ కు చెందిన తిరుగుబాటు దారుల ప్రోత్సాహంతో వీరంతా కదులుతున్నట్టు సమాచారం..

మరిన్ని ఇక్కడ చూడండి: ముస్లిం దేశంలో ప్రపంచంలో మొట్టమొదటి ఏకైక గాజు దేవాలయం

Old is Gold: సంప్రదాయ పాత్రల వైపు అడుగులు వేస్తున్న వంటిల్లు.. ఆరోగ్యం కోసమే!