AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపు కాబూల్ నగరాన్ని సందర్శించనున్న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ?

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ రేపు కాబూల్ నగరాన్ని సందర్శించే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే ఓ దేశ మంత్రి ఆఫ్ఘన్ ను సందర్చించబోవడం ఇదే మొదటిదవుతుంది.

రేపు కాబూల్ నగరాన్ని సందర్శించనున్న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ?
Kabul Airport To Flee Afgha
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Aug 21, 2021 | 10:35 PM

Share

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ రేపు కాబూల్ నగరాన్ని సందర్శించే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే ఓ దేశ మంత్రి ఆఫ్ఘన్ ను సందర్చించబోవడం ఇదే మొదటిదవుతుంది. ఆఫ్ఘన్ వ్యవహారాల్లో కీలక పాత్ర వహించాలని తమ దేశం నిర్ణయించినట్టు మహ్మద్ ఖురేషీ తెలిపారు. పరస్పర సంప్రదింపుల అనంతరం అన్ని ప్రభుత్వ పక్షాలు, తాలిబన్లు, మాజీ నేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ ఆయున సూచించారు. ఆ దేశంలో రక్తపాతాన్ని ఎదుర్కొనేందుకు ఎవరూ సిద్ధంగా లేరని, దేశంలో శాంతి, సుస్థిరత నెలకొనాలని అంతా కోరుతున్నారని ఆయన చెప్పారు. ఆఫ్ఘన్ లోని పలువురు నేతలతో అక్కడి తమ దేశ రాయబారి సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన తెలిపారు. కాబూల్ ని తాలిబన్లు ఆక్రమించుకున్న అనంతరం పాకిస్థాన్ వారికి బాహాటంగానే మద్దతు ప్రకటించింది. తాలిబన్లు బానిసత్వ సంకెళ్లను తెంచి వేశారని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లకు ఆఫ్ఘన్ లో ఈ పరిణామం ఏర్పడిందన్నారు. ఇక ఆఫ్ఘన్ లో శాంతి నెలకొనేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తామని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ క్వామర్ జావేద్ బాజ్వా శనివారం వెల్లడించారు.

తాలిబాన్లకు పాక్ సాయం చేస్తుండడంపై పలు దేశాలు తీవ్రంగా ఖండిస్తున్న తరుణంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఇలా ఉండగా పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ రేపు కాబూల్ సందర్శనపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి: ఆఫ్ఘన్ నుంచి పారిపోయేందుకు వేలాది మంది యత్నం.. గుంపులను చెదరగొట్టేందుకు అమెరికన్ దళాల బాష్పవాయు ప్రయోగం

ముస్లిం దేశంలో ప్రపంచంలో మొట్టమొదటి ఏకైక గాజు దేవాలయం