చాణక్య నీతి: కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఈ 2 తప్పనిసరి.. ఆచార్య చాణక్య చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం..

Chanakya Niti: ఆచార్య చాణక్య గొప్ప పండితులు. గొప్ప వ్యక్తిత్వం కలిగిన మార్గదర్శకులు. ఆచార్య చాణక్య వందల సంవత్సరాల క్రితం తన సమర్థవంతమైన వ్యూహం..

చాణక్య నీతి: కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఈ 2 తప్పనిసరి.. ఆచార్య చాణక్య చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం..
Acharya Chanakya

Chanakya Niti: ఆచార్య చాణక్య గొప్ప పండితులు. గొప్ప వ్యక్తిత్వం కలిగిన మార్గదర్శకులు. ఆచార్య చాణక్య వందల సంవత్సరాల క్రితం తన సమర్థవంతమైన వ్యూహం, దౌత్యం, రాజకీయ చతురతతో నంద వంశాన్ని నామరూపాల్లేకుండా చేసి.. మౌర్య సామ్రాజ్య స్థాపనకు సహకరించారు. ఈ క్రమంలో ఆయన ఆచరించిన విధానాల నేడు ప్రేరణగా నిలుస్తున్నాయి. నేటికీ చాలా మంది ప్రజలు ఆచార్య చాణక్యను ఉత్తమ గురువుగా, మార్గదర్శకుడిగా భావిస్తుంటారు. చాణక్య చెప్పింది పాటించడానికి కఠినంగా ఉన్నప్పటికీ.. అవి పాటిస్తే వచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఆయన చెప్పిన మాటల వెనుక ఉన్న లోతును అర్థం చేసుకుని, ఆ విషయాలను జీవితంలో అనువదించుకుంటే.. ఎలాంటి సమస్య వచ్చినా పెద్దగా అనిపించదు. పూర్తి విశ్వాసంతో ప్రతీ సమస్యను సులభంగా అధిగమిస్తారు.

ప్రస్తుత కాలంలో ప్రజలు తమ కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అయితే, కెరీర్‌లో విజయం సాధించాలంటే.. కొన్ని విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలంటారు ఆచార్య చాణక్య. ఇందుకోసం రెండు సూత్రాలను ప్రముఖంగా చెప్పారు. మరి ఆచార్య చాణక్య చెప్పిన ఆ రెండు కీలక విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. విజయానికి మొదటి సూత్రం విద్య. ప్రతి వ్యక్తి తన విద్య విషయంలో చాలా జాగ్రత్తగా, సీరియస్‌గా ఉండాలని ఆచార్య స్పష్టం చేశారు. విద్య సహాయంతో మీ స్థానాన్ని ఎక్కడైనా పదిలపరుచుకోవచ్చు. జ్ఞానం ఉన్న వ్యక్తికి ప్రపంచంలో ఏ పని అసాధ్యం కాదు. అలాంటి వ్యక్తి ప్రతిచోటా విజయం పొందుతాడు. గౌరవం పొందుతాడు. తల్లి సరస్వతితో పాటు, తల్లి లక్ష్మీ అనుగ్రహం కూడా ఇలాంటి వ్యక్తులపైనే ఉంటుంది. అలాంటి వారి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. ఆ వ్యక్తి జీవితంలోని అన్ని ఆనందాలను పొందుతాడు.

2. రెండవ సూత్రం క్రమశిక్షణ. మీరు కెరీర్‌లో ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే ఖచ్చితంగా క్రమశిక్షణతో ఉండాలి. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి జీవితంలో సమయం విలువను అర్థం చేసుకుంటారు. సమయం ప్రాధాన్యతను అర్థం చేసుకున్న వ్యక్తులు.. పనికిరాని అంశాల కోసం తమ సమయాన్ని వృథా చేయరు. మీలో ఉండే ఈ నిబద్ధత మిమ్మల్ని విజయం వైపు తీసుకెళుతుంది. అందుకే జీవితంలో విజయం సాధించాలంటే.. క్రమశిక్షణ కలిగి ఉండటం చాలా ముఖ్యం.

Also read:

Raksha Bandhan 2021: రక్షాబంధన్ రోజున మీ సోదరుల రాశి ప్రకారం ఈ రంగు రాఖీ కట్టండి.. పూర్తి వివరాలు మీకోసం..

Afghanistan Taliban Crisis: ఆఫ్గనిస్థాన్‌లో నయా గేమ్ షురూ చేసిన తాలిబన్లు – Watch Video

Padmasana Benefits: ఒత్తిడి, ఆందోళ‌న, మెడ నొప్పితో బాధ‌ప‌డుతున్నారా.? అయితే ఈ ఆస‌నాన్ని ట్రై చేయండి..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu