Raksha Bandhan 2021: రక్షాబంధన్ రోజున మీ సోదరుల రాశి ప్రకారం ఈ రంగు రాఖీ కట్టండి.. పూర్తి వివరాలు మీకోసం..

Raksha Bandhan 2021: దేశ వ్యాప్తంగా ప్రజలు రక్షా బంధన్ వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. సోదర, సోదరీ మణుల ప్రేమకు చిహ్నమైన...

Raksha Bandhan 2021: రక్షాబంధన్ రోజున మీ సోదరుల రాశి ప్రకారం ఈ రంగు రాఖీ కట్టండి.. పూర్తి వివరాలు మీకోసం..
Raksha Bandhan
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 22, 2021 | 8:26 AM

Raksha Bandhan 2021: దేశ వ్యాప్తంగా ప్రజలు రక్షా బంధన్ వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. సోదర, సోదరీ మణుల ప్రేమకు చిహ్నమైన ఈ రాఖీ పండుగను అంతే ప్రేమతో జరుపుకుంటున్నారు. ఈ పర్వదినం రోజున.. ప్రతీ సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి వారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుతారు. అలాగే.. ప్రతీ సోదరుడు తన సోదరికి జీవితాంతం రక్షణగా ఉంటానని భరోసా ఇస్తారు. అయితే, ఈ రాఖీని శుభ సమయాల్లోనే కట్టాలి. ముఖ్యంగా మీ సోదరుడికి రాశి ప్రకారం మీరు రాఖీ కడితే వారికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని మీకు తెలుసా? జ్యోతిష్యుల ప్రకారం.. వ్యక్తుల రాశి ప్రకారం ఆయా రంగుల రాఖీలు కడితే ప్రయోజనాలుంటాయట. మరి ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: మేషరాశి వారికి ఎరుపు రంగు రాఖీ కట్టడం శ్రేయస్కరం. ఈ రంగు రాఖీ కట్టడం వలన సోదరుడి ఆరోగ్యం బాగుంటుంది.

వృషభం: సిల్వర్ కలర్ రాఖీ కడితే మంచిది. జ్యోతిష్యుల ప్రకారం.. ఈ రంగు రాఖీని కట్టడం వలన సోదరుడు తన పనిలో పురోగతిని సాధిస్తాడు. అతని నిలిచిపోయిన పనులు అన్నీ పూర్తవుతాయి.

మిథునం: ఈ రాశి వారికి ఆకుపచ్చ రంగు రాఖీ కట్టాలి. ఈ రంగు రాఖీ కట్టడం ద్వారా నిలిచిపోయిన పనులు పునరుద్ధరించబడుతాయి. ఇది విశ్వాసాన్ని కూడా పెంచుతుంది.

కర్కాటకం: మీ సోదరుడి రాశి కర్కాటక రాశి అయితే క్రీమ్ కలర్ రాఖీ కట్టాలి. ఈ రంగు రాఖీ కట్టడం వలన మీ సోదరుడు విద్యా రంగంలో విజయం సాధిస్తాడు. ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి.

సింహం: జ్యోతిష్యుల ప్రకారం సింహ రాశి వ్యక్తులకు బంగారు, పసుపు, నారింజ రంగు రాఖీ కట్టాలి. ఈ రాఖీ కట్టేటప్పుడు 7 ముడులు చేయాలి. ఇలా చేయడం ద్వారా మీ సోదరుడు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడు.

కన్యారాశి: ఈ రాశి సోదరులకు తెలుపు లేదా వెండి రంగు రాఖీ కట్టాలి. ఈ రంగు రాఖీ కట్టడం ద్వారా మీ సోదరుడు సురక్షితంగా ఉంటాడు.

తులారాశి: మీ సోదరుడి రాశి తులారాశి అయితే క్రీమ్ కలర్ రాఖీ కట్టండి. ఇది సంపదను పెంచుతుంది. అలాగే, వారికి అదృష్టం వరిస్తుంది.

వృశ్చికం: ఈ రాశి వారికి గులాబీ, ఎరుపు రంగు రాఖీ కట్టాలి. ఇది వారిలోని విశ్వాసాన్ని పెంచుతుంది.

ధనుస్సు: మీ సోదరుడి రాశి ధనుస్సు అయితే పసుపు రంగు రాఖీ కట్టాలి. ఈ రోజు సోదరుడికి పసుపు, కుంకుమ తిలకం పెట్టండి. ఇలా చేయడం ద్వారా వారు వ్యాపారం, ఉద్యోగంలో విజయాన్ని సాధిస్తారు.

మకరం: మీ సోదరుడి రాశి మకరరాశి అయితే నీలం రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయడం ద్వారా వ్యాపారాల్లో మీ సోదరుడు అభివృద్ధి సాధిస్తాడు.

కుంభం: కుంభ రాశి వ్యక్తులకు తెల్లని, ఆకాశ వర్ణపు రాఖీ కట్టాలి. ఇది జీవితంలో వచ్చే సమస్యలను తొలగిస్తుంది. విజయం త్వరగా సిద్ధిస్తుంది.

మీనం: మీ సోదరుడి రాశి మీనం అయితే ఎరుపు, పసుపు, నారింజ రంగు రాఖీ కట్టవచ్చు. ఇది మీ సోదరుడికి విజయాన్ని అందిస్తుంది.

Also read:

Afghanistan Taliban Crisis: ఆఫ్గనిస్థాన్‌లో నయా గేమ్ షురూ చేసిన తాలిబన్లు – Watch Video

Padmasana Benefits: ఒత్తిడి, ఆందోళ‌న, మెడ నొప్పితో బాధ‌ప‌డుతున్నారా.? అయితే ఈ ఆస‌నాన్ని ట్రై చేయండి..

Sports Car Racing: హైదరాబాద్‌లో స్పోర్ట్స్ కార్ రేసింగ్.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం.. పూర్తి వివరాలు మీకోసం..

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..